Balineni Srinivasa Reddy : సీఎం జగన్‌తో మాజీమంత్రి బాలినేని కీలక భేటీ

Balineni Srinivasa Reddy: రాజీమానా అనంతరం తాడేపల్లికి రావాలంటూ హైకమాండ్ పిలిచినా.. స్పందించని బాలినేని గత మూడు రోజులుగా హైదరాబాద్ లోనే ఉన్నారు. ఇవాళ సీఎం జగన్ ని కలిశారు. ఆయనతో కీలక భేటీ అయ్యారు.

Balineni Srinivasa Reddy : సీఎం జగన్‌తో మాజీమంత్రి బాలినేని కీలక భేటీ

Balineni Srinivasa Reddy

Balineni Srinivasa Reddy : మాజీమంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి పంచాయితీ తాడేపల్లికి చేరింది. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ ను కలిశారు బాలినేని. గత నెల 29న నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల వైసీపీ రీజనల్ కో-ఆర్డినేటర్ పదవికి బాలినేని రాజీనామా చేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తనకు ప్రాధాన్యం దక్కడం లేదంటూ కొంతకాలంగా బాలినేని అసంతృప్తితో ఉన్నారు.

రాజీమానా అనంతరం తాడేపల్లికి రావాలంటూ హైకమాండ్ పిలిచినా.. స్పందించని బాలినేని గత మూడు రోజులుగా హైదరాబాద్ లోనే ఉన్నారు. ఇవాళ సీఎం జగన్ ని కలిశారు. ఆయనతో కీలక భేటీ అయ్యారు.(Balineni Srinivasa Reddy)

అసలేం జరిగిందంటే..
మాజీమంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి రాజీనామా వ్యవహారం.. వైసీపీ శ్రేణుల్లో హాట్ టాపిక్ గా మారింది. బాలినేని కొంతకాలంగా పార్టీ అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని, కేడర్ ఇబ్బంది పడుతున్నారని, వేరే వ్యక్తులకు ప్రాధాన్యత ఇస్తున్నారన్నది బాలినేని శ్రీనివాస రెడ్డి ప్రధాన ఆరోపణ. మంత్రి పదవి కోల్పోయినప్పటి నుంచి కూడా ఆయన అసంతృప్తిగా ఉన్నారు. తాజాగా సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో ప్రోటోకాల్ విషయంలో జరిగిన కొన్ని ఇబ్బందులతో బాలినేని మరోసారి అలకపూనారు. జిల్లాలో కొంతమందికే ప్రాధాన్యం ఇస్తున్నారని, తనకు ఇవ్వడం లేదని ఆయన వాపోతున్నారు.

Also Read..Kuppam Constituency: కుప్పంలో చంద్రబాబు విజయ పరంపరకు.. వైసీపీ చెక్ పెడుతుందా.. బాబు కీలక నిర్ణయం ఏంటి?

రీజనల్ కో-ఆర్డినేటర్ బాధ్యతల నుంచి తప్పుకోవడానికి గల కారణాలపై బాలినేని.. సీఎం జగన్ కు వివరిస్తున్నారు. అయితే, బాలినేనిని సీఎం జగన్ బుజ్జగించినట్లు సమాచారం. మరి, తనకు అప్పగించిన బాధ్యతలో బాలినేని కొనసాగుతారా? లేక ఏదైనా నిర్ణయం తీసుకుంటారా? అనేది సీఎం జగన్ తో భేటీ తర్వాత తెలిసే అవకాశం ఉంది.(Balineni Srinivasa Reddy)

ముందు నుంచి కూడా బాలినేని శ్రీనివాస రెడ్డి పార్టీలో సీనియర్ నేతగా ఉన్నారు. గతంలో మంత్రి పదవి తొలగింపుతో ఆయన అలకబూనారు. అప్పుడు పార్టీ పెద్దలు సహా సీఎం జగన్ బాలినేనిని బుజ్జగించారు. దాంతో అప్పుడు ఆయన అలకవీడారు. తాజాగా ప్రొటోకాల్ విషయంలో వివాదం రేగింది. దీంతో పాటు జిల్లాలో తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని బాలినేని ఫీల్ అవుతున్నారు. మంత్రి ఆదిమూలపు సురేశ్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనేది బాలినేని ముందు నుంచి చేస్తున్న అభియోగం. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? బాలినేనికి ఎలాంటి హామీ ఇస్తారు అనేది తెలియాల్సి ఉంది.(Balineni Srinivasa Reddy)

Also Read..Chirala Assembly Constituency: ఆమంచి, కరణం మధ్య సయోధ్య కుదిరినట్లేనా.. టీడీపీ, జనసేన నుంచి బరిలో దిగేదెవరు?