bandi sanjay to visit kaleshwaram: 30 మంది నేతలతో కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకు వెళ్తాను: బండి సంజయ్

కాళేశ్వరాన్ని సందర్శించాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ నిర్ణయం తీసుకున్నారు. అక్కడికి వెళ్ళేందుకు తనకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ కు బండి సంజయ్ లేఖ రాశారు. తన కాళేశ్వరం పర్యటనలో 30 మంది ముఖ్య నేతలు ఉంటారని ఆయన చెప్పారు. వచ్చే నెల మొదటి వారంలో బీజేపీ నేతలు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శిస్తారని అన్నారు.

bandi sanjay to visit kaleshwaram: 30 మంది నేతలతో కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకు వెళ్తాను: బండి సంజయ్

Bandi sanjay on family planning surgery

Bandi sanjay to visit kaleshwaram: కాళేశ్వరాన్ని సందర్శించాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ నిర్ణయం తీసుకున్నారు. అక్కడికి వెళ్ళేందుకు తనకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ కు బండి సంజయ్ లేఖ రాశారు. తన కాళేశ్వరం పర్యటనలో 30 మంది ముఖ్య నేతలు ఉంటారని ఆయన చెప్పారు. వచ్చే నెల మొదటి వారంలో బీజేపీ నేతలు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శిస్తారని అన్నారు.

ప్రాజెక్టు నిర్మాణంపై తమకు ఉన్న సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ఈ పర్యటన చేపడతామని బండి సంజయ్ చెప్పారు. ప్రాజెక్టు వద్ద వరదలతో మోటార్లకు నష్టం ఏ మేరకు జరిగిందన్న విషయాన్ని కూడా తాము పరిశీలిస్తామని ఆయన అన్నారు. 1998లోనూ వరదలు రావడంతో శ్రీశైలం టర్బైన్లు దెబ్బతిన్నాయని, అప్పట్లోనూ ప్రతిపక్షాలు ప్రాజెక్టును సందర్శించాయని చెప్పారు.

కాగా, సమర్థమైన ప్రణాళిక లేకుండా కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేయడం ఎందుకని బండి సంజయ్ ఇంతకు ముందు విమర్శించిన విషయం తెలిసిందే. సాగునీటి ప్రాజెక్టుల పేరుతో టీఆర్ఎస్ పెద్దఎత్తున అవినీతికి పాల్పడిందని బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.

Chinese construction work: మరోసారి దుందుడుకు చర్యలకు పాల్పడుతోన్న చైనా.. అరుణాచల్‌ ప్రదేశ్‌లో నిర్మాణాలు?