MCD: బీజేపీ నేతలపై ఆప్ హార్స్ ట్రేడింగ్.. సంచలన ఆరోపణలు చేసిన కమల పార్టీ

అరవింద్ కేజ్రీవాల్ ఏజెంట్ శిఖా జార్జ్ అనే వ్యక్తి బీజేపీ కౌన్సిలర్లను సంప్రదించి తమవైపుకు రమ్మని చెప్పారని పూనావాలా ఆరోపించారు. ఢిల్లీలో శినవారం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ ‘‘బీజేపీ కౌన్సిలర్ మోనికా పంత్‭ను శిఖా జార్జ్ సంప్రదించారు. ఆమెకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు

MCD: బీజేపీ నేతలపై ఆప్ హార్స్ ట్రేడింగ్.. సంచలన ఆరోపణలు చేసిన కమల పార్టీ

BJP claims AAP trying to lure councillors

MCD: ఇతర పార్టీ నేతల్ని తమ పార్టీలోకి లాగేస్తున్నారని ఈ మధ్య కాలంలో భారతీయ జనతా పార్టీపై తరుచూ ఆరోపణలు వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం ఆమ్ ఆద్మీ పార్టీ సైతం ఈ ఆరోపణలు బలంగానే చేసింది. తమ ఎమ్మెల్యేలను కొని ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నారని ఆ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపిస్తూ ఏకంగా విశ్వాస పరీక్షకు కూడా దిగారు. అనంతరం ఆయన పూర్తి మెజారిటీతో గెలిచి, తమ ఎమ్మెల్యేలను కొనడం బీజేపీ వల్ల కాదంటూ రివర్స్ అటాక్ చేశారు.

ఇదిలా ఉంచితే.. బీజేపీపై ఇతర పార్టీలు ఇలాంటి ఆరోపణలు చేయడం సాధారణమే కానీ, బీజేపీయే ఇలాంటి ఆరోపణలు చేయడం కాస్త వింతగా అనిపిస్తుంది. వింతగా ఉన్నా ఇది నిజమే. తమ పార్టీ నేతలను ఆప్ తమవైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తోందని బీజేపీ ఆరోపించింది. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన తమ అభ్యర్థులపై ఆప్ హార్స్ ట్రేడింగ్ ప్రారంభించిందట. ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా చేసిన ఆరోపణ ఇది.

Gujarat Muslim MLA : గుజరాత్ లో గెలిచిన ఎకైక ముస్లిం ఎమ్మెల్యే.. ఏ పార్టీ నుంచో తెలుసా?

అరవింద్ కేజ్రీవాల్ ఏజెంట్ శిఖా జార్జ్ అనే వ్యక్తి బీజేపీ కౌన్సిలర్లను సంప్రదించి తమవైపుకు రమ్మని చెప్పారని పూనావాలా ఆరోపించారు. ఢిల్లీలో శినవారం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ ‘‘బీజేపీ కౌన్సిలర్ మోనికా పంత్‭ను శిఖా జార్జ్ సంప్రదించారు. ఆమెకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రత్యేక నిధులు అంటే ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. మోనికాతో జార్జ్ చేసిన చర్చలకు సంబంధించిన సీసీటీవీ రికార్డులు మా దగ్గర ఉన్నాయి. వాటిని ఏసీబీకి ఇస్తాం’’ అని అన్నారు.

కాగా, ఆప్ ప్రలోభాలపై ఢిల్లీ బీజేపీ ట్విట్టర్ వేదికగా గట్టి వార్నింగ్ ఇచ్చింది. ‘‘ఇది అరవింద్ కేజ్రీవాల్‭కు మా హెచ్చరిక. వాళ్లు బీజేపీ కౌన్సిర్లు, ఆప్ కౌన్సిర్లు కాదు. వారిని మీరు కొనలేరు. బీజేపీ కౌన్సిలర్లను మభ్యపెట్టే ప్రయత్నం మానుకోండి. ఆప్ అమ్మకానికి సిద్ధంగా ఉందేమో, కానీ బీజేపీ ఎప్పటికీ అమ్ముడు పోదు’’ అని ట్వీట్ చేశారు.

Gujarat: మరోమారు ముఖ్యమంత్రిగా ఏకగ్రీవంగా ఎన్నికైన భూపేంద్ర పటేల్.. సోమవారం ప్రమాణ స్వీకారం