BS Yediyurappa: తిరిగి తిరిగి మళ్లీ యడియూరప్ప వెనకకే వస్తున్న బీజేపీ

యూడియూరప్పకు రాష్ట్రంలో ప్రజాభిమానం పెద్ద స్థాయిలో ఉంది. ఒక రకంగా చెప్పాలంటే.. యడియూరప్ప లేకపోతే కర్ణాటక బీజేపీ తల లేని మొండెంలాగే ఉంటుందనేది విమర్శకులు అంటున్నారు. ఆయన కాకుండా బీజేపీలో మరే నాయకుడు మాస్ రాజకీయంలో రాణించలేదు. ఎటు తిరిగి చూసినా యడియూరప్ప మాత్రమే ప్రజల్లో గుర్తింపు పొందిన, ప్రజా అభిమానం ఉన్న నాయకుడు ఉన్నారు

BS Yediyurappa: తిరిగి తిరిగి మళ్లీ యడియూరప్ప వెనకకే వస్తున్న బీజేపీ

BJP Falls Back On BS Yediyurappa

BS Yediyurappa: బీజేపీ అంటే యడియూరప్ప.. యడియూరప్ప అంటే బీజేపీ.. ఇదీ కర్ణాటకలోని బీజేపీ పరిస్థితి. రాష్ట్రంలో రాజకీయంగా ఓ వెలుగు వెలిగిన బీఎస్ యడియూరప్పను కొద్ది కాలం క్రితం ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించింది కేంద్ర అధిష్టానం. ఆయన స్థానంలో బసవరాజు బొమ్మైని నియమించింది. దీనిపై మనసులో నైరాశ్యం ఉన్నప్పటికీ, అధిష్టాన ఆదేశాలకు వ్యతిరేకంగా ఆయన ఒక్క మాట మాట్లాడలేదు. ఇక ఆయనకు బీజేపీ టాప్ బాడీలో స్థానం కల్పించినప్పటికీ, దాని పట్ల ఆయనకు సంతృప్తి లేదని పార్టీ వర్గాలే గుసగుసలాడాయి. వాస్తవానికి అప్పటి నుంచి యడియూరప్ప బహిరంగ చర్చలోకి రావడానికి కూడా పెద్దగా ఇష్టపడలేదు. ఢిల్లీ నుంచి పెద్దలెవరైనా రాష్ట్రానికి వచ్చినప్పుడే ప్రజల మధ్యలో కనిపిస్తున్నారు.

Holi Colors : హోలీ రంగులతో సైడ్ ఎఫెక్ట్స్, జాగ్రత్తలు తప్పనిసరంటున్న నిపుణులు !

చాలా తక్కువ సందర్భాల్లో రాష్ట్ర బీజేపీ వ్యవహాల్లో బహిరంగంగా కనిపిస్తున్నారు. బీజేపీలో యడియూరప్ప పని ఇక ముగింసిందనే చాలా మంది అనుకున్నారు. కానీ పరిస్థితులు ఎలాంటి మలుపుకైనా తిరిగి, మళ్లీ అదే స్థానానికి రావొచ్చనేది నానుది. కర్ణాటక రాజకీయాలు కూడా అలాగే మలుపు తీసుకున్నాయి. బీజేపీ ఆయనను పక్కన పెట్టింది, కానీ ఎన్నికలు సమీపిస్తుండడంతో మళ్లీ ఆయనే బీజేపీకి కావాల్సి వచ్చింది. మళ్లీ యడియూరప్ప కేంద్రంగానే కర్ణాటక బీజేపీ రాజకీయాలు కొనసాగబోతున్నాయి. ఎన్నికల రథసారధిగా ఆయనే ఉండబోతున్నారు.

Crude Oil Import: రష్యా నుంచి భారీగా పెరిగిన చమురు దిగుమతులు.. రోజుకు 1.6 మిలియన్ బ్యారెళ్ల చమురు దిగుమతి

నిజానికి బీజేపీని రాష్ట్రంలో మూలాల నుంచి నిర్మించింది యడియూరప్పే. ఇదే పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు. అయితే మధ్యలో ఒకసారి పార్టీతో విభేదాలు వచ్చి కర్ణాటక జనతా పార్టీ అనే కొత్త పార్టీ పెట్టుకున్నప్పటికీ, మళ్లీ కొద్ది రోజులకే బీజేపీలో దాన్ని విలీనం చేశారు. మళ్లీ పార్టీ ముఖ్యుడిగా, ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రస్థానం ప్రారంభించారు. అనుకున్నట్టే రాష్ట్రంలో పార్టీని అతిపెద్ద పార్టీగా నిలబెట్టారు. అయితే పార్టీ అధిష్టానం ఎందుకో ఆయనను పక్కన పెట్టింది. చాలా సందర్భాల్లో యడియూరప్పను పట్టించుకోనట్టే వ్యవహరించింది. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారుతున్నాయి. యడియూరప్ప లేకుండా బీజేపీ అగ్ర నాయకులెవరూ కార్ణాటక రావడం లేదు.

American Airlines: విమానంలో మరోసారి మూత్ర విసర్జన ఘటన.. నిందితున్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు

యూడియూరప్పకు రాష్ట్రంలో ప్రజాభిమానం పెద్ద స్థాయిలో ఉంది. ఒక రకంగా చెప్పాలంటే.. యడియూరప్ప లేకపోతే కర్ణాటక బీజేపీ తల లేని మొండెంలాగే ఉంటుందనేది విమర్శకులు అంటున్నారు. ఆయన కాకుండా బీజేపీలో మరే నాయకుడు మాస్ రాజకీయంలో రాణించలేదు. ఎటు తిరిగి చూసినా యడియూరప్ప మాత్రమే ప్రజల్లో గుర్తింపు పొందిన, ప్రజా అభిమానం ఉన్న నాయకుడు ఉన్నారు. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీలో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేపీసీసీ అధినేత డీకే శివకుమార్ దూసుకుపోతున్నారు. వారిద్దరికీ ప్రజల మద్దతు పెద్ద ఎత్తున వస్తోంది. దీంతో యడియూరప్పను ముందుకు తీసుకురాకపోతే పార్టీ నష్టపోతుందని భావించిన అధిష్టానం.. ఈ ఎన్నికలను యడియూరప్ప నాయకత్వంలోనే నిర్వహించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.