తెలంగాణలో అధికారం కోసం బీజేపీ మాస్టర్ ప్లాన్, సక్సెస్ అయ్యేనా?

  • Published By: naveen ,Published On : October 14, 2020 / 05:41 PM IST
తెలంగాణలో అధికారం కోసం బీజేపీ మాస్టర్ ప్లాన్, సక్సెస్ అయ్యేనా?

bjp focus on telangana: దక్షిణ భారతదేశంలో పాగా పాగా వేయాలనేది బీజేపీ ఆకాంక్ష. అందుకు రాజకీయంగా పార్టీ బలపడడానికి అవకాశాలున్న తెలంగాణను ఎంచుకున్నారు ఆ పార్టీ పెద్దలు. దీర్ఘకాలిక ప్రణాళికలతో పక్కా వ్యూహం అమలు చేస్తూ వెళ్తున్నారు కమలనాథులు. తెలంగాణలో బలపడడానికి ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడం, కాంగ్రెస్‌ను బలహీనపరచడం అనేది బీజేపీ టార్గెట్ అంటున్నారు. రాష్ట్రంలో అధికార పార్టీ వెంట వెలమ సామాజికవర్గం ఉండగా, రెడ్లు కాంగ్రెస్ వైపు ఉన్నారనేది బహిరంగ రహస్యమే. దీనిని బ్రేక్ చేసి చేసేందుకు బీజేపీ ఎత్తులు వేస్తోందని ఆ పార్టీ నేతలు అంటున్నారు.

టీడీపీకి అండగా ఉన్న బీసీలను బీజేపీ వైపు తిప్పుకొనే ప్రయత్నం:
గతంలో టీడీపీకి అండగా ఉన్న బీసీలను బీజేపీ వైపు తిప్పుకొనే ప్రయత్నం మొదలుపెట్టిందని అంటున్నారు. అందులో భాగంగానే బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణపై ప్రత్యక దృష్టి సారించి, బీసీ నేతలకు ప్రాధాన్యం ఇస్తోంది. బీసీలలో బలమైన సామాజికవర్గమైన మున్నూరు కాపులకు చెందిన నేతను రాష్ట్ర బీజేపీ చీఫ్‌గా, జాతీయ స్థాయిలో అదే సామాజికవర్గానికి చెందిన మరో నేతకు జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పజెప్పారు. తెలంగాణలో టీడీపీకి దగ్గరగా ఉన్న మున్నూరు కాపు సామాజికవర్గానికి పదవులు ఇవ్వడం ద్వారా బీసీలను దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు బీజేపీ నేతల్లో టాక్.

డీకే అరుణకు ఉపాధ్యక్ష పదవి ఇవ్వడం వెనుక కారణమిదే:
తెలంగాణలో రాజకీయంగా బలమైనరెడ్డి సామాజికవర్గానికి చెందిన డీకే అరుణకు ఉపాధ్యక్ష పదవి ఇవ్వడం వెనుక అనేక సమీకరణాలున్నాయట. ఆమెను జాతీయ రాజకీయాల్లోకి పంపడం ద్వారా మహిళకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పడానికేనని అంటున్నారు. అంతే కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి జాతీయ స్థాయిలో పదవులు వస్తాయంటూ ఇతర పార్టీ నేతలను ఆకర్షించే పనిలో పార్టీ పెద్దలున్నారని చెబుతున్నారు. కాంగ్రెస్‌లోని ఇతర నేతలను బీజేపీలో చేర్పించేందుకు అరుణ కృషి చేస్తారని భావిస్తున్నారు. మరి కమలనాథుల కల ఎంత వరకు నెరవేరుతుందో? వారి వ్యూహలు ఫలిస్తాయో లేదో కాలమే తేల్చాలి.