జగన్ మాకు ప్రత్యర్థే.. వైసీపీతో పొత్తుపై బీజేపీ క్లారిటీ

ఏపీ సీఎం జగన్, ప్రధాని మోడీని కలవడంతో వైసీపీ, బీజేపీ కలుస్తాయని.. పొత్తు పెట్టుకుంటాయని వార్తలు వస్తున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో ఏకంగా జగన్ పార్టీ

  • Published By: veegamteam ,Published On : February 15, 2020 / 12:25 PM IST
జగన్ మాకు ప్రత్యర్థే.. వైసీపీతో పొత్తుపై బీజేపీ క్లారిటీ

ఏపీ సీఎం జగన్, ప్రధాని మోడీని కలవడంతో వైసీపీ, బీజేపీ కలుస్తాయని.. పొత్తు పెట్టుకుంటాయని వార్తలు వస్తున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో ఏకంగా జగన్ పార్టీ

ఏపీ సీఎం జగన్, ప్రధాని మోడీని కలవడంతో వైసీపీ, బీజేపీ కలుస్తాయని.. పొత్తు పెట్టుకుంటాయని వార్తలు వస్తున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో ఏకంగా జగన్ పార్టీ చేరుతుందని ప్రచారం జరుగుతోంది. అందుకే సీఎం జగన్ ప్రధాని మోడీ, అమిత్ షా లను కలిశారనే టాక్ రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. ఈ క్రమంలో వైసీపీతో దోస్తీ, పొత్తు గురించి బీజేపీ జాతీయ కార్యదర్శి, ఏపీ బీజేపీ ఇంచార్జ్ సునీల్ దేవ్ ధర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

జగన్ మాకు శత్రువే:
వైసీపీతో ఏ విధమైన పొత్తు ఉండదని సునీల్ దేవ్ ధర్ తేల్చి చెప్పారు. ఏపీలో జనసేనతో మాత్రమే పొత్తు ఉందని అన్నారు. జగన్ మాకు ప్రత్యర్థే అని స్పష్టం చేశారాయన. వైసీపీ, టీడీపీలు తమకు రాజకీయ ప్రత్యర్థులని.. జనసేనతో కలిసి వైసీపీ విధానాలపై పోరాటం చేస్తున్నామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేస్తామన్నారు. టీడీపీ, వైసీపీలను తాము సమానమైన రాజకీయ శత్రువులుగానే పరిగణిస్తామన్నారు. మేము ప్రతిపక్షంలో ఉన్నామన్న విషయాన్ని మర్చిపోకూడదన్నారు. రాజ్యసభలో బీజేపీకి బలం లేకున్నా వైసీపీ, టీడీపీ, బిజూ జనతాదళ్ మాకు మద్దతిచ్చాయని, అంతమాత్రాన పొత్తు పెట్టుకున్నట్లు కాదని సునీల్ వెల్లడించారు.

జగన్ తప్పు నిర్ణయాలు తీసుకుంటున్నారు:
స్థానిక ఎన్నికల్లో జనసేనతో కలిసి పని చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నామని సునీల్ దేవ్ ధర్ తెలిపారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధాని కలుస్తారని…అది కామన్ అన్నారు. దానికి వేరే అర్ధాలు తీసుకోవద్దని కోరారు. సీఎం జగన్ తప్పు నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు. ఎన్ఆర్‌సి , సీఏఏ లకు పార్లమెంటులో మద్దతిచ్చి ఇప్పుడు బయట ఏ విధంగా వ్యతిరేకంగా ర్యాలీ చేస్తారని ఆయన ప్రశ్నించారు. దీనిపై వైసీపీ నేతలు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

వైసీపీ, టీడీపీ చాలా ప్రమాదకరమైన పార్టీలు:
వైసీపీ, టీడీపీ చాలా ప్రమాదకరమైన పార్టీలని సునీల్ అన్నారు. ప్రధాని మోడీ-సీఎం జగన్‌ల భేటీపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ నటుడిగా ఉండి రాజకీయ నాయకుడు అయ్యారని.. చంద్రబాబు రాజకీయ నేత నుంచి నటుడిగా మారుతున్నారని ఎద్దేవా చేశారు. ఏపీ ఆర్థిక పరిస్థితి రోజు దిగజారిపోతోందన్నారు. తాము అమరావతి రాజధానికే అనుకూలమన్న దేవ్ ధర్.. రాజధాని అంశం మాత్రం రాష్ట్ర పరిధిలోనిదని స్పష్టం చేశారు.

అమరావతికే బీజేపీ మద్దతు:
ఏపీ రాజధాని విషయంలో బీజేపీ అమరావతికే మద్దతిస్తుందని స్పష్టం చేశారు దేవ్ ధర్. రాజధాని విషయంలో అందరూ ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజదాని అంశంలో టీడీపీ, వైసీపీ మైండ్ గేమ్ ఆడుతున్నాయని మండిపడ్డారు. కౌన్సిల్ రద్దు అనేది ఏకపక్ష నిర్ణయమన్నారు. ఒక్క రాష్ట్రం ఒక్క రాజధాని అనేది బీజేపీ నినాదం అని దేవ్ ధర్ వ్యాఖ్యానించారు.