గ్రేటర్ ఎన్నికల్లో కీలక పరిణామం.. బీజేపీ-జనసేన పొత్తు?

  • Published By: naveen ,Published On : November 19, 2020 / 01:01 PM IST
గ్రేటర్ ఎన్నికల్లో కీలక పరిణామం.. బీజేపీ-జనసేన పొత్తు?

bjp janasena alliance in ghmc elections: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకోనుందా? బీజేపీ జనసేన పొత్తు పెట్టుకోనున్నాయా? గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయనున్నాయా? ఇప్పుడీ ప్రశ్నలు హాట్ టాపిక్ గా మారాయి. ఏపీలో జనసేన, బీజేపీ మధ్య పొత్తు ఉన్న సంగతి తెలిసిందే. అయితే తెలంగాణలో మాత్రం ఎలాంటి పొత్తు లేదు. కాగా, జనసేనాని పవన్ కళ్యాణ్ తో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ భేటీ కానున్నారు.

దీంతో బీజేపీ, జనసేన మధ్య పొత్తు వార్తలు వెలుగులోకి వచ్చాయి. గ్రేటర్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయడంపై ఇరువురూ చర్చించనున్నారని తెలుస్తోంది. కాగా, గ్రేటర్ ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు లేదని, ఒంటరిగానే బరిలోకి దిగుతామని గతంలో బండి సంజయ్ ప్రకటించారు. ఇక తాము కూడా గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేస్తామని ఇటీవలే జనసేనాని పవన్ ప్రకటించారు.


https://10tv.in/trs-leader-teegala-krishna-reddy-to-join-bjp/
జీహెచ్ఎంసీ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. బల్దియాపై జెండా ఎగరేయాలని పట్టుదలగా ఉన్నాయి. గెలుపుపై అధికార పార్టీ ధీమాగా ఉంది. 110 సీట్లతో విజయం మనదే అని సీఎం కేసీఆర్ అన్నారు. సర్వేలన్నీ టీఆర్ఎస్ కే అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. బీజేపీ కూడా గట్టి పోటీ ఇవ్వాలని చూస్తోంది. ఎలాగైనా గ్రేటర్ ఎన్నికల్లో విజయం సాధించాలని చూస్తోంది. ఇందులో భాగంగా వ్యూహాలకు పదును పెడుతోంది.