హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలుపు

హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలుపు

Haryana Elections : ఢిల్లీ రైతు ఆందోళన బీజేపీపై ప్రతికూలతను తీసుకొస్తుంది. ఈ ఎఫెక్ట్ హర్యానాలో జరిగిన స్థానిక ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. హరియాణా మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో అధికార బీజేపీ–జేజేపీ ప్రభుత్వానికి ప్రతికూల ఫలితాలు వచ్చాయి. ఆదివారం అంబాలా, పంచకుల, సోనిపట్, రేవారి, ధరుహిరా, సంప్లా, ఉక్లనా నగరాల్లో జరిగిన ఎన్నికలకు బుధవారం ఉదయం నుంచి కౌంటింగ్ ప్రక్రియ చేపట్టారు.

బీజేపీ పంచ్ కుల నుంచి మాత్రమే గెలుపొందగా ఆ పార్టీ అభ్యర్థి కుల్ భూషణ్ గోయెల్ ను మేయర్ గా సెట్ చేశారు. కీలకమైన సోనిపట్, అంబాలా, ఉక్లనా, ధరుహిరా స్థానాల్లో బీజేపీ-జేజేపీ వెనుకంజ వేశాయి. సోనిపట్‌ను కాంగ్రెస్‌ గెలుచుకుంది, అంబాలాలో హెచ్‌జేపీ పార్టీ గెలుపొందగా పంచకుల, రెవారిలో మాత్రం బీజేపీకి గెలుపు దక్కింది. ఉక్లానా, ధరుహిరాల్లో జేజేపీకి ఎదురుదెబ్బ తగిలింది.

సివిక్ బాడీ ఎలక్షన్స్ ఇన్ ఛార్జి అయిన అభిమన్యు మాట్లాడుతూ.. ఈ విజయం డెవలప్ మెంట్ ఓ సింబల్ లాంటిది. ప్రతిపక్షం ఓటర్ల ఇంటరెస్ట్ ను రైతుల ఆందోళన వైపు మళ్లించాలని చూసినా ఫలితాలు స్పష్టంగా కనిపించాయి. అని ఓ మీడియాతో అన్నారు.

కాంగ్రెస్ సోనిపట్ అనే ప్రాంతంలో 13వేల 818 ఓట్ల వ్యత్యాసంతో గెలుపొందింది. పార్టీ అభ్యర్థి నిఖిల్ మదాన్ మేయర్ పీఠం అందుకోనున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ లీడర్ శ్రీవత్స ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఎలక్షన్ రిజల్ట్ పై రైతు ఆందోళన ప్రభావం కనిపిస్తుంది. ‘గుర్తు పెట్టుకోండి. సోనిపట్ ప్రాంతం సింఘూ బోర్డర్ పక్కనే ఉంది. హర్యానా, యూపీల్లోని రైతు ఆందోళనకు కేంద్ర బిందువుగా మారింది’ అని ట్వీట్ చేశాడు.