జగన్ నిర్ణయాలు చాలా ప్రమాదకరం : వైసీపీతో పొత్తు లేదు

వైసీపీ, బీజేపీ మధ్య పొత్తు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. బీజేపీతో వైసీపీ పొత్తు పెట్టుకుంటుందని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. సీఎం జగన్ ఢిల్లీ పర్యటన, ప్రధాని

  • Published By: veegamteam ,Published On : February 16, 2020 / 08:56 AM IST
జగన్ నిర్ణయాలు చాలా ప్రమాదకరం : వైసీపీతో పొత్తు లేదు

వైసీపీ, బీజేపీ మధ్య పొత్తు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. బీజేపీతో వైసీపీ పొత్తు పెట్టుకుంటుందని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. సీఎం జగన్ ఢిల్లీ పర్యటన, ప్రధాని

వైసీపీ, బీజేపీ మధ్య పొత్తు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. బీజేపీతో వైసీపీ పొత్తు పెట్టుకుంటుందని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. సీఎం జగన్ ఢిల్లీ పర్యటన, ప్రధాని మోడీ, అమిత్ షాలతో భేటీ తర్వాత పొత్తు అంశం గురించి విస్తృతంగా ఊహాగానాలు వస్తున్నాయి. బీజేపీతో వైసీపీ పొత్తు పెట్టుకోవడమే కాదు.. ఏకంగా ఎన్డీయేలో వైసీపీ చేరుతుందని ప్రచారం జరుగుతోంది. పొత్తు గురించి ఏపీ బీజేపీ నేతలు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. ఏపీ బీజేపీ నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ పొత్తు ప్రసక్తే లేదని ఒకరంటే.. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చని మరొకరు అంటున్నారు.

తాజాగా బీజేపీ నేత పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీతో బీజేపీ పొత్తు ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు. ఏపీలో జనసేనతో మాత్రమే పొత్తు ఉందని, ఆ పార్టీతో మాత్రమే కలిసి పని చేస్తామని పురంధేశ్వరి చెప్పారు. సీఎం జగన్ పై పురంధేశ్వరి మండిపడ్డారు. జగన్ తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారని, అవి రాష్ట్రానికి చాలా ప్రమాదం అని అన్నారు. రాజధాని మార్పు, పీపీఏల రద్దు, శాసనమండలి రద్దు నిర్ణయాలు కరెక్ట్ కాదన్నారు. వైసీపీతో పొత్తు ఉంటుందని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని పురంధేశ్వరి మండిపడ్డారు.

రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా ఉందని పురంధేశ్వరి అన్నారు. జగన్ ప్రభుత్వం నిర్ణయాలతో పెట్టుబడులు వెనక్కి వెళ్తున్నాయన్నారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు సక్రమంగా పని చేయలేకపోతున్నారని చెప్పారు. ఏపీలో జనసేన పార్టీతో తప్ప మరే పార్టీతో బీజేపీకి పొత్తు లేదని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తాయన్నారు. ఏపీ రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీ పని చేస్తోందన్నారు.

వైసీపీ, టీడీపీ స్వప్రయోజనాల కోసమే పని చేస్తున్నాయని పురంధేశ్వరి అన్నారు. ఏపీలో ప్రతిపక్షం కూడా సరైన పాత్ర పోషించడం లేదన్నారు. చంద్రబాబు, జగన్ లు వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పని చేస్తున్నారని పురంధేశ్వరి ఆరోపించారు. పోలవరం రివర్స్ టెండరింగ్ తో కోర్టులకు వెళ్లే పరిస్థితి వచ్చిందన్నారు.

వైసీపీతో పొత్తు ముచ్చటే లేదని ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ దేవ్ ధర్ కూడా చెప్పారు. జగన్, చంద్రబాబు బీజేపీకి ప్రత్యర్థులే అని చెప్పారు. జనసేనతో మాత్రమే పొత్తు ఉందని, పవన్ తో కలిసి పని చేస్తామని దేవ్ ధర్ స్పష్టం చేశారు. కాగా, ఏపీకే చెందిన మరో బీజేపీ నేత టీజీ వెంకటేష్ మాత్రం భిన్నంగా స్పందించారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరన్న ఆయన.. రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీతో జగన్ పొత్తు పెట్టుకోవచ్చేమో అనే సందేహం వ్యక్తం చేయడం విశేషం.