Karnataka Polls: కర్ణాటక పోరుకు అస్త్రాలు సిద్ధం చేస్తున్న బీజేపీ.. ఎన్నికల ఇంచార్జీగా ధర్మేంద్ర ప్రధాన్

రాష్ట్రంలో నాలుగు వైపుల రథయాత్ర చేస్తామని, ఒక్కో వైపు నుంచి ఒక్కొక్కరు ప్రాతినిధ్యం వహిస్తారని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. ఈ యాత్రకు దాదాపు అన్నీ సిద్ధమైనట్లే కనిపిస్తోంది. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 130 స్థానాలకు పైగానే గెలుచుకుని మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప అన్నారు

Karnataka Polls: కర్ణాటక పోరుకు అస్త్రాలు సిద్ధం చేస్తున్న బీజేపీ.. ఎన్నికల ఇంచార్జీగా ధర్మేంద్ర ప్రధాన్

Dharmendra Pradhan

Karnataka Polls: ఈ యేడాది చివరి త్రైమాసికంలో కార్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార భారతీయ జనతా పార్టీ అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. దక్షిణాదిలో బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కావడంతో ఈ రాష్ట్రాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని బీజేపీ అధిష్టానం తన ప్రయత్నాలను పెద్ద ఎత్తున సాగిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ఎన్నికల ఇంచార్జీగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‭ను నియమించింది పార్టీ అధిష్టానం.

BMC Budget: రికార్డ్ స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టిన ముంబై మున్సిపాలిటీ.. దేశంలోని కొన్ని రాష్ట్రాల బడ్జెట్ కంటే కూడా ఎక్కువే

ఇక తమిళనాడు బీజేపీ యూనిట్ అధ్యక్షుడు కే.అన్నామలైను కర్ణాటక కో ఇన్‌చార్జీగా బీజేపీ నియమించింది. ధర్మేంద్ర ప్రధాన్ గతంలో పలు ఎన్నికల ఇన్ చార్జీగా పనిచేశారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల ఇన్ చార్జీగా ప్రధాన్ బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చారు. గతంలో కేంద్ర బీజేపీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ధర్మేంద్ర ప్రధాన్ బీహార్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, కర్ణాటక ఎన్నికల బాధ్యతలు నిర్వహించారు. కర్ణాటకలో కూడా అలాంటి ఫలితాలు తీసుకువస్తారనే ఆశ బీజేపీ అధిష్టానంలో ఉన్నట్లు సమాచారం.

CM Kejriwal: కేజ్రీవాల్ కార్యాలయం ఎదుట బీజేపీ నిరసన.. లిక్కర్ స్కాం నేపథ్యంలో సీఎం రాజీనామాకు డిమాండ్

రాష్ట్రంలో నాలుగు వైపుల రథయాత్ర చేస్తామని, ఒక్కో వైపు నుంచి ఒక్కొక్కరు ప్రాతినిధ్యం వహిస్తారని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. ఈ యాత్రకు దాదాపు అన్నీ సిద్ధమైనట్లే కనిపిస్తోంది. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 130 స్థానాలకు పైగానే గెలుచుకుని మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప అన్నారు. కాంగ్రెస్ పార్టీలో సీఎం కుర్చీ కుమ్ములాట కొనసాగుతోందని, ఈ విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు.