Gujarat Polls: ఎన్నికలకు దూరంగా, విమర్శలకు దగ్గరగా రాహుల్.. తీవ్రంగా ఎద్దేవా చేస్తోన్న బీజేపీ

40 మందితో కాంగ్రెస్ తన స్టార్ క్యాంపెయినర్ల జాబితా విడుదల చేసినప్పటికీ గెహ్లాట్ మినహా ముఖ్య నేతలు ఎవరూ గుజరాత్‭లో అడుగు పెట్టింది లేదు. వాస్తవానికి గుజరాత్ ఎన్నికల ప్రచారం మొత్తం గెహ్లాట్ భుజాల మీదే ఎత్తుకున్నట్లు కనిపిస్తోంది. పార్టీ మేనిఫెస్టో విడుదల సహా అన్ని కార్యక్రమాల్లో ఆయనే ప్రముఖంగా కనిపిస్తున్నారు. ఇక పార్టీకి కొత్తగా ఎన్నికైన పార్టీ జాతీయ అధినే మల్లికార్జున ఖర్గే సైతం గుజరాత్ ఎన్నికల ప్రచారంలో కనిపించడం లేదు.

Gujarat Polls: ఎన్నికలకు దూరంగా, విమర్శలకు దగ్గరగా రాహుల్.. తీవ్రంగా ఎద్దేవా చేస్తోన్న బీజేపీ

BJP sharp attack on Rahul Gandhi for his not campaigning for Gujarat Polls

Gujarat Polls: కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ తీరు విపక్ష పార్టీలకు అవకాశంగా మారుతోంది. దేశంలోని కీలక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుంటే, తనకు అదేదీ పట్టనట్టు రాహుల్ గాంధీ యాత్ర చేస్తున్నారు. వాస్తవానికి రాహుల్ చేస్తోన్న భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ పార్టీకి ఏ మేరకు ఉపయోగపడుతుందనే విషయం పక్కన పెడితే.. ఆ యాత్రలో పూర్తిగా మునిగిపోయి.. ఎన్నికల వేళ పార్టీని పట్టించుకోకుండా ఉంటే జరిగే నష్టం జరుగుతూనే ఉంది.

దేశంలో కాంగ్రెస్ పార్టీకి ప్రధాన విపక్షం భారతీయ జనతా పార్టీ. అలాంటి విపక్ష పార్టీ బలంగా ఉన్న రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. పైగా గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీని ఇచ్చింది. ఇలాంటి తరుణంలో పార్టీని ఎన్నికల్లో గెలిపించడమో, బలపర్చడమో చేసి విపక్ష పార్టీ బలహీనం చేయడానికి బదులు, తన మానాన తాను యాత్ర చేస్తూ పోతున్నారు. ఈ యాత్ర కూడా ఎన్నికలు జరిగే రాష్ట్రంలో లేకపోవడం మరో శోచనీయ అంశం. కొద్ది రోజుల క్రితం జరిగిన హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సైతం రాహుల్ దూరంగానే ఉన్నారు.

ఇప్పుడు ఇదే అంశాన్ని పట్టుకుని రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు సెటైర్ల మీద సెటైర్లు గుప్పిస్తున్నారు. ఎన్నికల్లో నిలబడే దమ్ము లేకనే రాహుల్ ఎక్కడెక్కడో తిరుగుతున్నారని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ శుక్రవారం పదునైన దాడి చేశారు. తాజాగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందిస్తూ.. ఎలాగూ ఓడిపోతామని తెలిసే ప్రచారానికి దూరంగా ఉంటున్నారని, వీటిని కప్పి పుచ్చుకోవడానికే ఏవేవో యాత్రలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

Gujarat Polls: రాహుల్ గాంధీకి ఎన్నికల్లో నిలబడే దమ్ము లేకే ఎక్కడెక్కడో తిరుగుతున్నారు.. భారత్ జోడో యాత్రపై అస్సాం సీఎం

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. బీజేపీ నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, యూపీ సీఎం యోగి, ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, పార్టీ ప్రముఖులు పెద్ద ఎత్తున వచ్చి ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి రాహుల్ కానీ ప్రియాంక కానీ సోనియా కానీ గుజరాత్ వెళ్లలేదు.

40 మందితో కాంగ్రెస్ తన స్టార్ క్యాంపెయినర్ల జాబితా విడుదల చేసినప్పటికీ గెహ్లాట్ మినహా ముఖ్య నేతలు ఎవరూ గుజరాత్‭లో అడుగు పెట్టింది లేదు. వాస్తవానికి గుజరాత్ ఎన్నికల ప్రచారం మొత్తం గెహ్లాట్ భుజాల మీదే ఎత్తుకున్నట్లు కనిపిస్తోంది. పార్టీ మేనిఫెస్టో విడుదల సహా అన్ని కార్యక్రమాల్లో ఆయనే ప్రముఖంగా కనిపిస్తున్నారు. ఇక పార్టీకి కొత్తగా ఎన్నికైన పార్టీ జాతీయ అధినే మల్లికార్జున ఖర్గే సైతం గుజరాత్ ఎన్నికల ప్రచారంలో కనిపించడం లేదు.

‘‘రాహుల్ సొంత నియోజకవర్గానికి వెళ్లి ఆయనను ఓడించాం.. కానీ రాహుల్ ఎన్నికల ప్రచారంలోకి రావడానికి కూడా భయపడుతున్నారు’’ అంటూ బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇన్ని విమర్శలు వస్తున్నప్పటికీ దీనిపై రాహుల్ గాంధీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ స్పందించడం లేదు. రాజకీయ పార్టీ అంటే ఎన్నికల్లో పోటీ పడి ప్రజావిశ్వాసం పొందాల్సిందే. ఏ రాజకీయ పార్టీకైనా ప్రజా విశ్వాసానికి ఎన్నికలు గీటు రాయి. అలాంటి ఎన్నికలకు రాహుల్ దూరంగా ఉండడం సహజంగానే విమర్శకులకు పని చెప్పినట్లే.

Farooq Abdullah: ఏ మతమూ చెడుది కాదు, మనుషులే అవినీతి పరులు.. జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం