చంద్రబాబు కట్టప్ప : పొత్తు ప్రసక్తే లేదు

ఏపీలో టీడీపీతో పొత్తు ప్రసక్తే లేదని బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దేవ్ ధర్ స్పష్టం చేశారు. టీడీపీకి డోర్లు మూసివేశామన్నారు. ఇది సునీల్ మాట కాదు.. మోడీ, అమిత్ షా, నడ్డా

10TV Telugu News

ఏపీలో టీడీపీతో పొత్తు ప్రసక్తే లేదని బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దేవ్ ధర్ స్పష్టం చేశారు. టీడీపీకి డోర్లు మూసివేశామన్నారు. ఇది సునీల్ మాట కాదు.. మోడీ, అమిత్ షా, నడ్డా

ఏపీలో టీడీపీతో పొత్తు ప్రసక్తే లేదని బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దేవ్ ధర్ స్పష్టం చేశారు. టీడీపీకి డోర్లు మూసివేశామన్నారు. ఇది సునీల్ మాట కాదు.. మోడీ, అమిత్ షా, నడ్డా చెప్పిన మాట అన్నారు. టీడీపీ శకం ముగిసిపోతుందన్న ఆయన.. ఆ పార్టీ నేతలు బీజేపీలో చేరాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు కట్టప్పలాంటి వాడని.. వెన్నుపోటు పొడిచాడని దేవ్ ధర్ ఆరోపించారు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ స్వతహాగానే  ఎదుగుతుందని చెప్పారు. బీజేపీతో బంధం తెచ్చుకుని చంద్రబాబు చాలా పెద్ద తప్పు చేశారని సునీల్ అన్నారు.