రాజధానిపై జగన్ నిర్ణయానికి చంద్రబాబే కారణం : అసెంబ్లీతో అమరావతి అభివృద్ధి చెందదు

ఏపీ రాజధానిపై ప్రభుత్వానికి జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదిక దుమారం రేపింది. రాజకీయ పార్టీలతో పాటు ప్రజల్లో ప్రకంపనలు సృష్టించింది. అమరావతి రైతులు ఆందోళన బాట

  • Published By: veegamteam ,Published On : December 21, 2019 / 09:14 AM IST
రాజధానిపై జగన్ నిర్ణయానికి చంద్రబాబే కారణం : అసెంబ్లీతో అమరావతి అభివృద్ధి చెందదు

ఏపీ రాజధానిపై ప్రభుత్వానికి జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదిక దుమారం రేపింది. రాజకీయ పార్టీలతో పాటు ప్రజల్లో ప్రకంపనలు సృష్టించింది. అమరావతి రైతులు ఆందోళన బాట

ఏపీ రాజధానిపై ప్రభుత్వానికి జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదిక దుమారం రేపింది. రాజకీయ పార్టీలతో పాటు ప్రజల్లో ప్రకంపనలు సృష్టించింది. అమరావతి రైతులు ఆందోళన బాట పట్టారు. జీఎన్ రావు కమిటీ నివేదిక బూటకం అన్నారు. సీఎం జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రాజధాని ప్రాంత రైతులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

జీఎన్ రావు కమిటీ నివేదికపై ఒక్కో పార్టీ నాయకులు ఒక్కో రకంగా స్పందించారు. కొందరు స్వాగతిస్తే కొందరు వ్యతిరేకిస్తున్నారు. జీఎన్ రావు కమిటీ నివేదికపై బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. సీఎం 
జగన్ నిర్ణయాలతో ప్రజలు గందరగోళంలో ఉన్నారని వాపోయారు. జీఎన్ రావు కమిటీ కాదు జగన్ కమిటీ అనడం మేలు అన్నారు. జీఎన్ రావు కమిటీకి శాస్త్రీయత లేదని విష్ణు చెప్పారు.

అసలు.. రాజధాని పై జగన్ నిర్ణయం తీసుకోవడానికి.. ఈ గందరగోళానికి సగం కారణం చంద్రబాబే అని ఆయన ఆరోపించారు. టీడీపీ చేసిన పాపానికి రాజధాని రైతులు బలవుతున్నారని విష్ణువర్దన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పరిపాలన వికేంద్రీకరణ అనేది పొలిటికల్ డ్రామా అని ఆయన అన్నారు. అసెంబ్లీ సమావేశాలతో అమరావతి అభివృద్ధి చెందదని తేల్చి చెప్పారు. కర్నూలులో హైకోర్టు జిరాక్స్ సెంటర్లు మాత్రమే వస్తాయని ఎద్దేవా చేశారు. సీమకు హైకోర్టుతో పాటు అభివృద్ధికి నిధులివ్వాలని విష్ణు డిమాండ్ చేశారు.

రాజధాని మార్పుపై అధికార పార్టీ కార్యకర్తల నుంచే వ్యతిరేకత వస్తోంది. రాజధాని అంశంపై జీఎన్‌ రావు కమిటీ ఇచ్చిన నివేదిక మరింత ఉద్రిక్తతను పెంచింది. మూడు రాజధానులంటూ సీఎం జగన్ చేసిన ప్రకటనపై రాజధాని ప్రజలు భగ్గుమంటున్నారు. నాలుగు రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. వెలగపూడిలోని గ్రామ పంచాయతీ కార్యాలయానికి వేసిన పార్టీ రంగులను వైసీపీ కార్యకర్తలే తుడిచేశారు.

వికేంద్రీకరణ పేరుతో రాజధానిని మార్చడంపై నిరసనగా వెలగపూడిలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. తుళ్లూరులో మహాధర్నా నేపథ్యంలో రైతులు వాహనాలను అడ్డుకున్నారు. దీంతో సచివాలయానికి వెళ్లే మార్గంలో వాహనాల రాకపోకలు స్తంభించాయి. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ నినాదాలు చేస్తున్నారు.

Also Read : ఆంధ్రప్రదేశ్‌లో 25 జిల్లాలు