చంద్రబాబు సినిమా అయిపోయింది 3 భాగాలే : 4వ భాగంలో సీఎం అవ్వడం ఖాయం

జగన్ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మండిపడ్డారు. రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉంటే చంద్రబాబు ఇంటి పైనే ప్రభుత్వం దృష్టి పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు

  • Published By: veegamteam ,Published On : September 25, 2019 / 02:04 PM IST
చంద్రబాబు సినిమా అయిపోయింది 3 భాగాలే : 4వ భాగంలో సీఎం అవ్వడం ఖాయం

జగన్ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మండిపడ్డారు. రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉంటే చంద్రబాబు ఇంటి పైనే ప్రభుత్వం దృష్టి పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు

జగన్ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మండిపడ్డారు. రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉంటే చంద్రబాబు ఇంటి పైనే ప్రభుత్వం దృష్టి పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు సినిమా అయిపోయిందని వైసీపీ నేతలు పగటి కలలు కంటున్నారని విమర్శించారు. ‘చంద్రబాబు ముఖ్యమంత్రి అనే సినిమా’ ప్రస్తుతం మూడు భాగాలే అయ్యింది.. నాలుగో భాగంలో‌ మళ్లీ చంద్రబాబు సీఎం‌ అవడం‌ ఖాయం అని బుద్ధా వెంకన్న జోస్యం చెప్పారు. చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటి అనుమతుల విషయంలో బహిరంగ చర్చకు తాను సిద్ధమని ప్రకటించారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కూడా చర్చకు సిద్ధమా..? అని సవాల్ విసిరారు. కావాలనే చంద్రబాబు ఇంటిని ప్రభుత్వం టార్గెట్ చేసిందని ఆయన ఆరోపించారు. 

ఉండవల్లిలో కృష్ణా నది కరకట్ట పక్కనే ఉన్న చంద్రబాబు ఇల్లు అక్రమ కట్టడమని, వారం రోజుల్లో ఆ ఇంటిని కూల్చేస్తామని సీఆర్డీఏ అధికారులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై బుద్ధా వెంకన్న ఫైర్ అయ్యారు. ఇంటి యజమాని లింగమనేని రమేష్ అన్ని అనుమతులు చూపించినా.. అధికారులు కూల్చివేత నోటీసులు ఇవ్వడం దారుణం అన్నారు. చంద్రబాబు ఉంటున్నారన్న కారణంగానే ఆ ఇంటిని కూలగొట్టాలని ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. 2007 లో వైఎస్ సీఎంగా ఉన్న సమయంలోనే ఆ ఇంటికి అనుమతులు ఇచ్చారని గుర్తు చేశారు. ఆ ఇల్లు అక్రమమే అయితే వైఎస్ ఇచ్చిన జీవోలు కూడా అక్రమమా అని ప్రశ్నించారు. అసలు ఎమ్మెల్యే ఆర్కే మంగళగిరికి ఎమ్మెల్యేనా లేఖ చంద్రబాబు ఇంటికి ఎమ్మెల్యేనా అని అడిగారు.

సీఎం జగన్ కి కట్టడం ఎలాగూ రాదూ కనీసం కూల్చడమైనా మానుకోవాలని హితవు పలికారు. ఇసుక, వరదలు వంటి విషయాల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. నదీ పరివాహక ప్రాంతంలో చాలా ఇల్లు ఉన్నాయని వాటి జోలికి వెళ్లకుండా చంద్రబాబు ఇంటి మీదకి రావడమేంటని నిలదీశారు. కూల్చాలంటే రాష్ట్రంలో చాలా అక్రమ కట్టడాలు ఉన్నాయన్నారు. ఏపీ మాజీ స్పీకర్ కోడెలను వేధించినట్లుగానే చంద్రబాబుని మానసికంగా దెబ్బ తీయాలని చూస్తున్నారని.. జగన్ లాంటి వారిని చంద్రబాబు ఎంతో మందిని చూశారని బుద్దా వెంకన్న అన్నారు. చంద్రబాబు ముందు జగన్ ఆటలు సాగవన్నారు.