CAA ముస్లింలకు వ్యతిరేకం కాదు : కేంద్రమంత్రి ఆర్కే సింగ్

దేశంలో ముస్లిం జనాభా పెరుగుతోందని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ అన్నారు. పౌరసత్వ సవరణ చట్టం ముస్లింలకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.

  • Published By: veegamteam ,Published On : January 5, 2020 / 10:40 AM IST
CAA ముస్లింలకు వ్యతిరేకం కాదు : కేంద్రమంత్రి ఆర్కే సింగ్

దేశంలో ముస్లిం జనాభా పెరుగుతోందని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ అన్నారు. పౌరసత్వ సవరణ చట్టం ముస్లింలకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.

దేశంలో ముస్లిం జనాభా పెరుగుతోందని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ అన్నారు. ఆదివారం (జనవరి 5, 2020) విజయనగరం జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలోని ప్రజల పౌరసత్వానికి సీఏఏ వ్యతిరేకం కాదని తెలిపారు. పౌరసత్వ సవరణ చట్టం ముస్లింలకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. కొన్ని పార్టీలు సీఏఏపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని విమర్శించారు. మేక్ ఇన్ ఇండియా-గ్రేట్ ఇండియా అనేది బీజేపీ నినాదం అని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తోందన్నారు. 

పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏకు) వ్యతిరేకంగా దేశంలో చాలా చోట్ల నిరసనలు జరుగుతున్నాయి. ఈ చట్టం ముస్లింలపై వివక్ష చూపిస్తోందని ఆరోపిస్తూ జనాలు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, కర్నాటక, ఢిల్లీల్లో ఇలాంటి ప్రదర్శనలు హింసాత్మకంగానూ మారాయి. అయితే సీఏఏలో ముస్లింలు ఆందోళన చెందాల్సిందేమీ లేదని కేంద్ర ప్రభుత్వం అంటోంది. ఇది పొరుగుదేశాలైన పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్‌లో ఏళ్లుగా వేధింపులు అనుభవించి, భారత్‌లో తప్ప మరెక్కడా ఆశ్రయం పొందలేకపోయిన మైనార్టీలకు పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన చట్టమని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టత ఇచ్చారు.

సీఏఏ వల్ల దేశంలోని ఎవరి పౌరసత్వమూ పోదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్న విషయం తెలిసిందే. కాంగ్రెస్, ఆప్, తృణమూల్ కాంగ్రెస్‌లు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ దేశవ్యాప్తంగా హింసాత్మక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయని అమిత్ షా ఆరోపించారు. కానీ ప్రభుత్వం స్పష్టత ఇచ్చిన తర్వాత కూడా ముస్లిం వర్గాల్లో మాత్రం ఆందోళనలు ఇంకా పూర్తిగా తగ్గట్లేదు. జాతీయ పౌరసత్వ చట్టం తర్వాత కేంద్రం ఎన్ఆర్‌సీ తెచ్చి, తమను దేశం నుంచి వెళ్లగొడతుందని వారిలో కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సీఏఏపై నిరసనలు ఓ దిశానిర్దేశం లేకుండా జరుగుతున్నాయి. వీటి వెనుక పెద్ద సంస్థలు గానీ, నాయకులు గానీ ఉన్నట్లు కనిపించడం లేదు. ఈ ఆందోళనల్లో చోటుచేసుకుంటున్న హింసను ముస్లిం సముదాయంతో సహా అన్ని వర్గాలూ ఖండిస్తున్నాయి. ఇస్లాం మత గురువులు కూడా చాలా మంది సీఏఏపై స్పందించారు.