Bihar: లాలూ ప్రసాద్ యాదవ్‭ను మళ్లీ టార్గెట్ చేసిన సీబీఐ.. ఫిర్యాదులేమీ లేవని మూసేసిన పాత కేసు రీఓపెన్

2021 మేలో ఈ ఆరోపణల మీద ఎటువంటి కేసు నమోదు కాలేదని విచారణ ముగించింది. ఈ కేసులో లాలూతో పాటు కుమారుడు, బిహార్ ప్రస్తుత ఉపముఖ్యమంత్రి తేజశ్వీ యాదవ్, కూమార్తెలు చందా యాదవ్, రాగిణి యాదవ్ ఉన్నారు. అయితే ఎలాంటి రిమార్కులు లేకుండా విచారణ ముగించిన సీబీఐనే మళ్లీ ఈ కేసును తిరగదోడుతుండడంపై రాజకీయ ప్రకంపణలు చెలరేగుతున్నాయి.

Bihar: లాలూ ప్రసాద్ యాదవ్‭ను మళ్లీ టార్గెట్ చేసిన సీబీఐ.. ఫిర్యాదులేమీ లేవని మూసేసిన పాత కేసు రీఓపెన్

CBI Reopens Corruption Case Against Lalu Yadav

Bihar: బిహార్ రాజకీయాలను కుదిపివేసిన లాలూ ప్రసాద్ యాదవ్ పాత కేసు మరోసారి రాజకీయ సంక్షోభానికి తెరలేపనున్నట్లు కనిపిస్తోంది. ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబీఐ) మరోసారి తిరగదోడింది. దాణా కుంభకోణం కేసులో చాలా రోజులు జైలులో ఉన్న లాలూ.. కొద్ది రోజుల క్రితమే బెయిల్ మీద విడుదలయ్యారు. అయితే బీజేపీతో జేడీయూ తెగదెంపులు చేసుకుని ఆర్జేడీతో చేతులు కలిపిన కొద్ది రోజులకే ఇది మళ్లీ తెరపైకి రావడం గమనార్హం.

Twitter Data Breach: ప్రమాదంలో ట్విట్టర్ యూజర్లు.. అమ్మకానికి 40 కోట్ల మంది డేటా!

యూపీఏ మొదటి ప్రభుత్వ హయాంలో రైల్వే మంత్రిగా ఉన్న లాలూ.. ఆ సమయంలో కొన్ని కాంట్రాక్టుల విషయంలో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణల నడుమ 2018లో సీబీఐ దర్యాప్తు చేపట్టింది. అనంతరం 2021 మేలో ఈ ఆరోపణల మీద ఎటువంటి కేసు నమోదు కాలేదని విచారణ ముగించింది. ఈ కేసులో లాలూతో పాటు కుమారుడు, బిహార్ ప్రస్తుత ఉపముఖ్యమంత్రి తేజశ్వీ యాదవ్, కూమార్తెలు చందా యాదవ్, రాగిణి యాదవ్ ఉన్నారు. అయితే ఎలాంటి రిమార్కులు లేకుండా విచారణ ముగించిన సీబీఐనే మళ్లీ ఈ కేసును తిరగదోడుతుండడంపై రాజకీయ ప్రకంపణలు చెలరేగుతున్నాయి.

MK Stalin: నెహ్రూ వారసుడి మాటలు గాడ్సే వారసుల్ని కలవరపెడుతున్నాయి

బిహార్‭లో బీజేపీని గద్దె దించిన ఫలితంగానే విపక్షాలపై ప్రతీకారానికి పాల్పడుతున్నారని అధికారంలో ఉన్న జేడీయూ-ఆర్జేడీ సహా ఇతర రాజకీయ పక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ముంబైలోని బాంద్రాలోని రైల్ ల్యాండ్ లీజు ప్రాజెక్టులు, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌ను పునరుద్ధరించడంపై ఆసక్తి చూపిన రియల్ ఎస్టేట్ మేజర్ డీఎల్ఎఫ్ గ్రూప్ నుంచి లాలూ లంచంగా అందుకున్నారని కేసులో ఆరోపించారు. ఈ నెల ప్రారంభంలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేసుకుని ప్రస్తుతం లాలూ.. రాజకీయాలకు కాస్త దూరంగానే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజా కేసు తెరపైకి వచ్చింది.