కలకలం : జనసేన ఎంపీ అభ్యర్థి ఇంట్లో సీబీఐ సోదాలు

  • Published By: veegamteam ,Published On : April 28, 2019 / 03:21 AM IST
కలకలం : జనసేన ఎంపీ అభ్యర్థి ఇంట్లో సీబీఐ సోదాలు

కర్నూలు జిల్లా నంద్యాల జనసేన ఎంపీ అభ్యర్థి ఎస్పీవై రెడ్డి ఇంట్లో, ఆఫీస్‌లో సీబీఐ సోదాలు కొనసాగుతున్నాయి. శనివారం (ఏప్రిల్ 27,2019) నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. తప్పుడు ధ్రువపత్రాలతో లోన్‌  తీసుకుని మోసం చేశారని బ్యాంక్‌ అధికారుల ఫిర్యాదుతో సోదాలు చేస్తున్నారు. కుటుంబసభ్యులను కర్ణాటక బ్యాంకు అధికారులు, సీబీఐ అధికారులు రహస్యంగా విచారించినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ప్రచారం చేస్తున్న  వేళ అస్వస్థతకు గురైన ఎస్పీవై రెడ్డి ప్రస్తుతం హైదరాబాద్ లో చికిత్స పొందుతున్నారు.

శనివారం (ఏప్రిల్ 27,2019) ఉదయం నుంచి సోదాలు జరుగుతున్నాయి. పరిశ్రమల పేరుతో బ్యాంకులో రుణాలు తీసుకున్నారని, తిరిగి చెల్లించలేదని బ్యాంకు అధికారుల ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్పీవై రెడ్డి ఇంట్లో  సీబీఐ సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. సోదాల విషయంపై ఎస్పీవై రెడ్డి కుటుంబ సభ్యులు స్పందించలేదు. నంది పైపుల పరిశ్రమకు చెందిన ఉన్నత ఉద్యోగుల ఇళ్లలోనూ సోదాలు జరిగినట్టు సమాచారం. ఎస్పీవై రెడ్డి ఇంట్లో సీబీఐ సోదాలు కలకలం రేపాయి. ఎస్పీవై రెడ్డి 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత టీడీపీలోకి వెళ్లారు. చివరకు జనసేనలో చేరారు. టీడీపీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ ఎస్పీవై రెడ్డి.. చివరి నిమిషంలో జనసేనలో జాయిన్ అయ్యారు. ఆ పార్టీ టికెట్ మీద నంద్యాల ఎంపీగా పోటీ చేశారు.