ఏపీకి ఊరట : పోలవరానికి కేంద్ర నిధులు విడుదల

  • Published By: chvmurthy ,Published On : November 8, 2019 / 11:48 AM IST
ఏపీకి ఊరట : పోలవరానికి కేంద్ర నిధులు విడుదల

ఏపీ లో  పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి  కేంద్రం నుంచి మరో ముందడుగు పడింది.  రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఖర్చు పెట్టిన రూ.5600 కోట్ల నిధుల్లో కేంద్రం 1850 కోట్లు రీఎంబర్స్మెంట్ చేసేందుకు ఆర్ధక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  ఈనిధులు త్వరలోనే రాష్ట్ర ఖాతాకు జమ కానున్నాయి. 

పోలవరం కోసం ఖర్చు చేసిననిధులను తిరిగి చెల్లించాలని  సీఎం జగన్ ఇటీవల ప్రధాని మోడీని కలిసినప్పడు విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన కేంద్రం నిధులు  విడుదల చేసింది. మొదట 3వేల కోట్ల  రూపాయలు వస్తాయని భావించారు. కానీ  కేంద్రం  రాష్ట్రాన్ని మరికొన్ని వివరాలను అడిగింది. అవి పరిశీలించిన తర్వాత  మిగిలిన నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది.  

జగన్ సీఎం అయిున తర్వాత పోలవరం పనుల్లో అవినీతి జరిగిందనే కారణంతో  రివర్స్ టెండరింగ్ విధానానికి వెళ్లింది రాష్ట్ర ప్రభుత్వం. దీనివల్ల రాష్ట్ర  ప్రభుత్వానికి రూ.850 కోట్ల రూపాయలు ఆదా అయ్యింది. జగన్ ఢిల్లీ పర్యటనలో ఇదే విషయాన్ని ప్రధానికి,  హోమంత్రి అమతి షాకు వివరించారు. జగన్ సీఎం అయ్యాక  కేంద్ర నుండి పోలవరం ప్రాజెక్టుకు విడుదలైన తొలి నిధువు ఇవే.