Aaditya Thackeray: దమ్ముంటే నామీద పోటీ చెయ్.. సీఎం షిండేకు ఆదిత్య థాకరే సవాల్

శివసేన రెండుగా చీలిపోయిన అనంతరం షిండే, ఉద్ధవ్ వర్గాలు తరుచూ బాహాబాహీకి వెళ్తున్నాయి. ఇక ఇరు వర్గాల మధ్య వైరం తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆదిత్య వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అలాగే బీఎంసీకి కొద్ది రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ముంబైలో బాగా పట్టున్న శివసేన ఇప్పుడు రెండుగా చీలడంతో, ఈ ఎన్నికల్లో ఇరు వర్గాల ప్రభావం ఎంత మేరకు ఉంటుందోనని చర్చలు సాగుతున్నాయి.

Aaditya Thackeray: దమ్ముంటే నామీద పోటీ చెయ్.. సీఎం షిండేకు ఆదిత్య థాకరే సవాల్

challenged to CM Shinde to contest the Assembly elections against me, says Aaditya Thackeray

Aaditya Thackeray: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‭నాథ్ షిండేకు మాజీ మంత్రి, శివసేన (ఉద్ధవ్ వర్గం) కీలక నేత ఆదిత్య థాకరే ఛాలెంజ్ విసిరారు. షిండేకు దమ్ముంటే అసెంబ్లీ ఎన్నికల్లో తన మీద పోటీ చేయాలని ఆయన అన్నారు. షిండే రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని, తాను రాజీనామా చేస్తానని, షిండే కూడా రాజీనామా చేస్తే పోటీకి దిగుతామని ఆదిత్య అన్నారు.

BRS: తెలంగాణ దాటి విస్తరిస్తున్న బీఆర్ఎస్.. ఛత్తీస్‭గఢ్‭లో ‘చెయ్యి’ అందిచనున్న కీలక నేత!

ఈ విషయమై ముంబైలో శనివారం మీడియాతో మాట్లాడుతూ ‘‘రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి ఏక్‭నాథ్ షిండేకు నేన్ సవాల్ విసురుతున్నాను. దమ్ముంటే అసెంబ్లీ ఎన్నికల్లో నామీద పోటీ చెయ్. నా సీటు నుంచి నేను ఇప్పుడే రాజీనామా చేస్తాను. నువ్వు రాజీనామా చెయ్. ఇద్దరం కలిసి ఒకే చోట పోటీ చేద్దాం. వోర్లీ నుంచి అయినా మరో చోట నుంచి అయినా పోటీకి నేను రెడీ’’ అని ఆదిత్య థాకరే అన్నారు.

PM Modi: రొట్టె తయారు చేసిన బిల్‌ గేట్స్‌ను మెచ్చుకున్న మోదీ.. మరో సలహా ఇచ్చిన ప్రధాని.. ఇంతకీ అదేంటంటే!

శివసేన రెండుగా చీలిపోయిన అనంతరం షిండే, ఉద్ధవ్ వర్గాలు తరుచూ బాహాబాహీకి వెళ్తున్నాయి. ఇక ఇరు వర్గాల మధ్య వైరం తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆదిత్య వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అలాగే బీఎంసీకి కొద్ది రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ముంబైలో బాగా పట్టున్న శివసేన ఇప్పుడు రెండుగా చీలడంతో, ఈ ఎన్నికల్లో ఇరు వర్గాల ప్రభావం ఎంత మేరకు ఉంటుందోనని చర్చలు సాగుతున్నాయి. అలాగే వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల అనంతరం రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి.