కుట్ర రాజకీయాలు కాకపోతే ఏంటీ : బదిలీలపై ఆగ్రహం

  • Published By: madhu ,Published On : March 27, 2019 / 05:02 AM IST
కుట్ర రాజకీయాలు కాకపోతే ఏంటీ : బదిలీలపై ఆగ్రహం

అధికారులను ఎందుకు బదిలీ చేశారు? జగన్ కోరితే మోడీ, అమిత్ షా బదిలీలకు కుట్ర చేస్తారా? తన భద్రతను పర్యవేక్షించే అధికారి బదిలీ చేయడం వెనక ఆంతర్యం ఏమిటీ? అంటూ సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. ఇంటెలిజెన్స్ చీఫ్ సహా కడప, శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలపై ఈసీ వేటు వేసింది. దీనిపై బాబు తీవ్రస్థాయిలో స్పందించారు. మార్చి 27వ తేదీ బుధవారం పార్టీ లీడర్స్‌తో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏపీ ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నారని.. మున్ముందు మరిన్ని చేస్తారని.. నేతలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇవి కుట్ర రాజకీయాలు కాకపోతే ఏంటీ అని ప్రశ్నించారు చంద్రబాబు.
Read Also : బదిలీలపై కోర్టుకు ఏపీ సర్కార్ : మోడీ, షా భయంకర వ్యక్తులు – బాబు

ఎన్నికలకు సంబంధం లేని వ్యవస్థ ఇంటెలిజెన్స్. ఏ కారణంతో ఇద్దరు ఎస్పీలను బదిలీ చేశారు అని నిలదీశారు. వివేకా హత్య కేసులో నిజాలు బయటకొస్తున్నాయనే.. కడప ఎస్పీని బదిలీ చేశారని అనుమానం వ్యక్తం చేశారాయన. పోలవరం ఆపాలని తెలంగాణ సుప్రీంకోర్టును ఆశ్రయించడం నీచమైన చర్యగా అభివర్ణించారు బాబు. కడుపు మంటతోనే సుప్రీంకోర్టులో కేసు వేశారని చెప్పుకొచ్చారు. ఇక తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అతివిశ్వాసంతోనే ఓడిపోయారన్నారు. ప్రజలు టీడీపీ పక్షానే ఉన్నారని.. ఈ కుట్రలు ఎంతోకాలం సాగవు అన్నారు. 

ఏపీ ఎన్నికల సమరంలో.. ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న వెంకటేశ్వరరావు టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని..తమ ఫోన్లను కూడా ట్యాప్ చేయిస్తున్నారంటూ వైసీపీ నేతలు పదే పదే ఈసీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరిలో వైసీపీ అధ్యక్షుడు జగన్, మార్చి 23వ తేదీన వైసీపీ నేత విజయ్ సాయిరెడ్డి కేంద్ర ఎన్నికల సంఘం ఫిర్యాదు చేసింది. మార్చి 25వ తేదీన బోత్స సత్యనారాయాణ ఇతర నేతలు ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో ఈసీ బదిలీల నిర్ణయం తీసుకుంది.
Read Also : కాంగ్రెస్ లో అంతేగా : టికెట్ ఇవ్వలేదని.. పార్టీ ఆఫీస్ సామాను ఎత్తుకెళ్లిన ఎమ్మెల్యే