కేసీఆర్ ఎఫెక్ట్: దావోస్ పర్యటన రద్దు చేసుకున్న చంద్రబాబు

టీఆర్ ఎస్ వర్కింగ్ ఫ్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం ఏపీ ప్రతిపక్షనేత జగన్ ను హైదరాబాద్ లో కలిసి ఫెడరల్ ఫ్రంట్ లోకి ఆహ్వానించటం, ఏపీలో కేసీఆర్ పర్యటనలతో ఏపీలో మారుతున్న రాజకీయాలతో ఈ ఏడు తన దావోస్ పర్యటన చంద్రబాబు రద్దు చేసుకున్నారు.

  • Published By: chvmurthy ,Published On : January 17, 2019 / 11:38 AM IST
కేసీఆర్ ఎఫెక్ట్: దావోస్ పర్యటన రద్దు చేసుకున్న చంద్రబాబు

టీఆర్ ఎస్ వర్కింగ్ ఫ్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం ఏపీ ప్రతిపక్షనేత జగన్ ను హైదరాబాద్ లో కలిసి ఫెడరల్ ఫ్రంట్ లోకి ఆహ్వానించటం, ఏపీలో కేసీఆర్ పర్యటనలతో ఏపీలో మారుతున్న రాజకీయాలతో ఈ ఏడు తన దావోస్ పర్యటన చంద్రబాబు రద్దు చేసుకున్నారు.

అమరావతి: ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనను రద్దు చేసుకున్నారు. రాష్ట్రంలో వేగంగా జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపధ్యంలో చంద్రబాబు దావోస్ పర్యటన రద్దు చేసుకున్నారు. ఈ నెల 22 నుండి 25 వరకు దావోస్ లో జురుగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోర్ లో చంద్రబాబు పాల్గొనాల్సి వుంది. ప్రతి ఏటా పాల్గొనే చంద్రబాబు, ఈసారి  రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపధ్యంలో రద్దు చేసుకున్నారు.
 రాష్టంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ఏపిలో కేసీఆర్ జోక్యం చేసుకొని తనను దెబ్బతీసేందుకు పావులు కదుపుతుండటం, పలువురు ఇతర పార్టీల నేతలు తెలుగుదేశం వైపు చూస్తుండటం, టికెట్ ఇవ్వకుంటే అలిగే వారిని బుజ్జగించడం వంటి అనేక కార్యక్రమాలు ఉన్నందున ప్రతి రోజు ముఖ్యమైనదే కాబట్టి చంద్రబాబు దావోస్ పర్యటన రద్దు చేసుకున్నారు.  త్వరలో కేసీఆర్ అమరావతి వచ్చి ఏపీ ప్రతిపక్ష నేత  జగన్ ను కలిసే అవకాసం ఉండటంతో  ఏపీ రాజరకీయాల్లో మార్పులు సంభవించే అవకాశం లేక పోలేదు.వీటికి తోడు జనవరి 21న సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ  ఉండటంతో దావోస్ పర్యటనను రద్దు చేసుకొని పార్టీ కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని చంద్రబాబు సన్నిహితులు, పార్టీ నాయకులు చెప్పడంతో ఆయన ఈనిర్ణయం తీసుకున్నారు.
ప్రతి ఏటా దావోస్ వెళ్లే చంద్రబాబు నాయుడు  తన పర్యటనలో పలువురు  పారిశ్రామిక వేత్తలు, బడా కంపెనీల సిఇవోలు, దేశాధినేతలతో సమావేశం అయ్యి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చేవారు. అయితే ఈసారి సీఎం వెళ్లలేక పోవడంతో ఎంతో ముఖ్యమైన దావోస్ పర్యటనకు సీఎం కుమారుడు ఐటి శాఖ మంత్రి నారా లోకేష్, ఆర్థిక మంత్రి యనమల రామక్రిష‌్ణుడు వెళ్లనున్నారు.