జగన్ కు మేలు చేసేందుకే కేసీఆర్ బెదిరింపులు : సీఎం చంద్రబాబు

జగన్ కు మేలు చేసేందుకే కేసీఆర్ బెదిరింపులు : సీఎం చంద్రబాబు

ఎన్నికల్లో జగన్ కు మేలు చేసేందుకే తెలంగాణ సీఎం కేసీఆర్ బెదిరింపులకు పాల్పడుతున్నారని సీఎం చంద్రబాబు విమర్శించారు.

జగన్ కు మేలు చేసేందుకే కేసీఆర్ బెదిరింపులు : సీఎం చంద్రబాబు

ఎన్నికల్లో జగన్ కు మేలు చేసేందుకే తెలంగాణ సీఎం కేసీఆర్ బెదిరింపులకు పాల్పడుతున్నారని సీఎం చంద్రబాబు విమర్శించారు.

అమరావతి : ఎన్నికల్లో జగన్ కు మేలు చేసేందుకే తెలంగాణ సీఎం కేసీఆర్ బెదిరింపులకు పాల్పడుతున్నారని సీఎం చంద్రబాబు విమర్శించారు. ఏపీలో తన డమ్మీని పెట్టాలని కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారని తెలిపారు. కేసీఆర్ ఇవ్వాల్సిన గిఫ్టులు జగన్ కు ఇప్పటికే ఇచ్చేశారని వెల్లడించారు. జగన్ భూములు రద్దు చేయకుండా గిఫ్ట్ ఇచ్చారని చెప్పారు. అమరావతిలో మార్చి 20 బుధవారం ఎలక్షన్ మిషన్ -2019పై చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. 

రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని ఇప్పుడు ఏపీ ఎన్నికలతో సంబంధం లేదంటున్నారని తెలిపారు. కేసులు మాఫీ చేస్తే హోదా అడగనని మోడీతో జగన్ డీల్ కుదుర్చుకున్నారని ఆరోపించారు. బీజేపీ, టీఆర్ఎస్ తో లాలూచీపడే వైసీపీ వల్ల రాష్ట్రానికి ఏం లాభమని ప్రశ్నించారు.

మన ప్రత్యర్థి కరడు గట్టిన నేరస్తుడనేది గుర్తించాలని తెలిపారు. వైసీపీకి ఒక్క అవకాశం ఇస్తే పెను ప్రమాదం సంభవిస్తుందన్నారు. జగన్ అధికారంలోకి వస్తే భూములు మింగేస్తారని, ఆస్తులు కబ్జా చేస్తారని చెప్పారు. హైదరాబాద్ లో ఆస్తులున్న టీడీపీ అభ్యర్థులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. నామినేషన్లు వేయకుండా టీఆర్ఎస్, వైసీపీ కుట్రలు చేస్తుందని మండిపడ్డారు.

×