అమరావతి ప్రాంత అభివృద్ధిపై జగన్ కు ఎందుకు కడుపు మంట : చంద్రబాబు

ఏపీ సీఎం జగన్ పై మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి ప్రాంత అభివృద్ధిపై జగన్ కు ఎందుకు కడుపు మంట అని మండిపడ్డారు.

  • Published By: veegamteam ,Published On : January 1, 2020 / 09:02 AM IST
అమరావతి ప్రాంత అభివృద్ధిపై జగన్ కు ఎందుకు కడుపు మంట : చంద్రబాబు

ఏపీ సీఎం జగన్ పై మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి ప్రాంత అభివృద్ధిపై జగన్ కు ఎందుకు కడుపు మంట అని మండిపడ్డారు.

ఏపీ సీఎం జగన్ పై మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి ప్రాంత అభివృద్ధిపై జగన్ కు ఎందుకు కడుపు మంట అని మండిపడ్డారు. దొంగలంతా కలిసి రాజధానిని నిర్ణయిస్తారా అని ప్రశ్నించారు. బుధవారం (జనవరి 1, 2020) రాజధాని ప్రాంతాల్లో చంద్రబాబు దంపతులు పర్యటించారు. ఎర్రబాలెంలో రైతుల దీక్షకు చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ జగన్ కు నీతి నిజాయితీ లేకున్నా..విశాఖ ప్రజలకున్నాయని తెలిపారు. విశాఖ అభివృద్ధికి ఎన్నో పెట్టుబడులు తెచ్చామని తెలిపారు. 

 

ప్రపంచానికే ఆదర్శ నగరంగా అమరావతి ఉండాలని కలలు కన్నానని అన్నారు. రాజధాని ప్రాంతంలో 75 శాతం మంది వెనుకబడినవారేనని చెప్పారు. గత వరదల్లో లంక గ్రామాలు మునగడం ఓ కుట్రేనని అన్నారు. అమరావతి సురక్షిత ప్రాంతమని కోర్టులు, గ్రీన్ ట్రిబ్యునల్ ధృవీకరించాయని…ఇప్పుడు ఇన్ సైడర్ ట్రేడింగ్ అని ప్రచారం మొదలు పెట్టారని తెలిపారు. 

అమరావతి రైతుల ఆందోళనల నేపథ్యంలో నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉన్న చంద్రబాబు రాజధాని గ్రామాల్లో పర్యటిస్తున్నారు. సతీమణి భువనేశ్వరతిలో కలిసి ముందుగా ఎర్రబాలెం చేరుకున్న చంద్రబాబు.. రైతులతో కలిసి కొద్ది సేపు దీక్ష చేశారు. వారి ఆందోళనకు సంఘీభావం ప్రకటించారు.

 

రాజధాని తరలింపు ప్రకటన తర్వాత తలెత్తిన పరిణామాలను గ్రామస్థులు చంద్రబాబు దృష్టికి తెచ్చారు. ఈ ప్రాంతంలో రాజధాని వస్తుందని భూములు ఇస్తే.. ఇప్పుడు రాజధాని మారుస్తామని వైసీపీ పాలకులు చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆవేదనపై చలించిపోయిన చంద్రబాబు.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమానదూరంలో ఉంటుందని అమరావతిని ఎంపిక చేస్తే.. ఇప్పుడు తరలిస్తామని వైసీపీ పాలకులు చెప్పడాన్ని తప్పుపట్టారు. 

 

రాజధానిలో పర్యటనకు ముందు చంద్రబాబు సతీసమేతంగా బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న చంద్రబాబుకు అర్చకులు స్వాగతం పలికి అంతరాలయానికి తీసుకెళ్లారు. చంద్రబాబు దంపతులు అక్కడ ప్రత్యేక పూజలు చేశారు.