సీఎం జగన్ కారణంగా వేల ఉద్యోగాలు పోయాయి

ఏసీ సీఎం జగన్ పై టీడీపీ చీఫ్ చంద్రబాబు మండిపడ్డారు. జగన్ తెలివి తక్కువ నిర్ణయాలతో తన శ్రమ వృథా అయిందన్నారు. విశాఖలో వేల ఉద్యోగాలు పోయాయని వాపోయారు.

  • Published By: veegamteam ,Published On : November 21, 2019 / 02:39 PM IST
సీఎం జగన్ కారణంగా వేల ఉద్యోగాలు పోయాయి

ఏసీ సీఎం జగన్ పై టీడీపీ చీఫ్ చంద్రబాబు మండిపడ్డారు. జగన్ తెలివి తక్కువ నిర్ణయాలతో తన శ్రమ వృథా అయిందన్నారు. విశాఖలో వేల ఉద్యోగాలు పోయాయని వాపోయారు.

ఏసీ సీఎం జగన్ పై టీడీపీ చీఫ్ చంద్రబాబు మండిపడ్డారు. జగన్ తెలివి తక్కువ నిర్ణయాలతో తన శ్రమ వృథా అయిందన్నారు. విశాఖలో వేల ఉద్యోగాలు పోయాయని వాపోయారు. ఏపీలో పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నట్టు లులు గ్రూప్ ప్రకటించింది. దీనిపై స్పందించిన చంద్రబాబు.. జగన్ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. జగన్ అనాలోచిత నిర్ణయాల కారణంగానే లులు గ్రూప్ ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. 

టీడీపీ ప్రభుత్వం హయాంలో తాను ఎన్నో సంప్రదింపులు జరిపి, నిరంతరం వెంటపడి లులు గ్రూప్ ను ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు ఒప్పించానని చంద్రబాబు గుర్తు చేశారు. ఈ ప్రాజెక్ట్ తో విశాఖలో వేల ఉద్యోగాలు రావడంతో పాటు స్థానికంగా అభివృద్ధి జరిగేదని చెప్పారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం చర్యలు వ్యాపార అనుకూల వాతావరణాన్ని దెబ్బతీశాయని ఆరోపించారు. లులు కంపెనీ పెట్టుబడులు ఉపసంహరించుకోవడానికి ప్రభుత్వమే కారణం అన్నారు. ప్రభుత్వ విధానాలతో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాయాలు పోతున్నాయని చంద్రబాబు వాపోయారు.