స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నారా? సక్సెస్ అవుతారా?

మనోళ్లకు సెంటిమెంట్‌ ఎక్కువే. అందుకు రాజకీయాలు కూడా అతీతం కాదు. ఒక్క దారుణ ఓటమి చంద్రబాబును సెంటిమెంట్‌నే నమ్ముకొనేలా చేస్తోంది. ఒంటరి పోరుతో గెలిచింది

  • Published By: veegamteam ,Published On : March 24, 2020 / 10:03 AM IST
స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నారా? సక్సెస్ అవుతారా?

మనోళ్లకు సెంటిమెంట్‌ ఎక్కువే. అందుకు రాజకీయాలు కూడా అతీతం కాదు. ఒక్క దారుణ ఓటమి చంద్రబాబును సెంటిమెంట్‌నే నమ్ముకొనేలా చేస్తోంది. ఒంటరి పోరుతో గెలిచింది

మనోళ్లకు సెంటిమెంట్‌ ఎక్కువే. అందుకు రాజకీయాలు కూడా అతీతం కాదు. ఒక్క దారుణ ఓటమి చంద్రబాబును సెంటిమెంట్‌నే నమ్ముకొనేలా చేస్తోంది. ఒంటరి పోరుతో గెలిచింది లేదనే సెంటిమెంట్‌ టీడీపీ అధినేత మైండ్‌లో పడిందా? స్థానిక ఎన్నికల్లో పొత్తులతోనే ముందుకు వెళ్లేలా నడిపిస్తోందా?

స్థానిక ఎన్నికల్లో సీపీఐతో టీడీపీ పొత్తు అందుకేనా?
రాజకీయాల్లో గెలుపోటములు సహజం. అయితే ఈ విషయంలోనూ కొందరు నేతలు సెంటిమెంట్‌ను ఫాలో అవ్వడం జరుగుతూ ఉంటుంది. తాజాగా ఏపీలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ రకమైన సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఏపీలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐతో పొత్తు పెట్టుకొని ముందుకెళ్లాలని చంద్రబాబు ఫిక్సయిపోయారంట. అందుకే చాలా చోట్ల ఆ పార్టీతో కలిసి పోటీకి సిద్ధమయ్యారని అంటున్నారు. సీట్ల సంఖ్య అటుఇటుగా ఉన్నా కలసి పోటీ చేయడం వల్ల మెరుగైన ఫలితాలు గ్యారెంటీ అనుకొని ముందుకు సాగిపోతున్నారట. ఈ రెండు పార్టీలు సీట్ల సర్దుబాటు చేసుకున్నాయి.

సీపీఎంతోనూ కలసి వెళ్లే ఆలోచనలో టీడీపీ:
సీపీఐతో పాటు మరో లెఫ్ట్ పార్టీ సీపీఎంతోనూ టీడీపీ పొత్తు పెట్టుకునే అవకాశాలున్నాయని అంటున్నారు. ఈ పొత్తుల అంశాన్ని చంద్రబాబు ఓ రకంగా సెంటిమెంట్‌గా భావిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. చాలాసార్లు ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లినప్పుడే టీడీపీకి విజయం దక్కింది. గత ఎన్నికల్లో ఆ పార్టీ సొంతంగా బరిలోకి దిగడంతో వారికి ఏ మాత్రం కలిసిరాలేదు. దీంతో పార్టీకి పొత్తులు సెంటిమెంట్ పరంగానూ కలిసొస్తాయని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయట. మరోవైపు అమరావతి ఉద్యమంలో తమతోపాటు కలిసొచ్చిన సీపీఐతో పొత్తు పెట్టుకోవడం సహేతుకమే అని టీడీపీ భావిస్తోంది. 

జనసేన, టీడీపీ కలిసి వెళ్లేలా స్థానిక నేతల ఒప్పందాలు:
మరోపక్క, లోకల్‌గా కూడా కొన్ని చోట్ల అక్కడి నాయకులే జనసేనతో పొత్తులు పెట్టుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే చాలా జిల్లాల్లో ఈ రెండు పార్టీల పొత్తు ఖరారు చేసేసుకున్నారట. గోదావరి జిల్లాలతో పాటు.. రెండు పార్టీలు కాస్త బలంగా ఉన్న చోట గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాయని చెబుతున్నారు. మొత్తానికి మళ్లీ పొత్తులతో ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్న టీడీపీకి… ఈ సెంటిమంట్ ఎంతవరకు కలిసొస్తుందో చూడాలని జనాలు అంటున్నారు.

Also Read | వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ ప్లాన్ కేంద్రానిదా? జగన్ మరింత జోరు పెంచుతారా?