Roja Selvamani Rk : చంద్రబాబు కాపీ కొట్టారు- టీడీపీ మేనిఫెస్టోపై మంత్రి రోజా విమర్శలు

Roja Selvamani Rk : 14 సంవత్సరాలు అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి ఇప్పుడు కొత్తగా పూర్ టూ రిచ్ అనడం కామెడీగా ఉందన్నారు.

Roja – Chandrababu : మహానాడులో చంద్రబాబు ప్రకటించిన టీడీపీ మేనిఫెస్టోపై ఏపీ మంత్రి రోజా విమర్శలు చేశారు. అది మేనిఫెస్టో కాదు మాయా ఫెస్టో అని అభివర్ణించారు. చంద్రబాబు.. మూడుసార్లు మేనిఫెస్టో ఇచ్చి ప్రజలను ఏ విధంగా మోసం చేశారో అందరికీ తెలిసిందే అన్నారు. చంద్రబాబు సినిమా ఫక్కీలో మేనిఫెస్టో వన్, టు, త్రీ అంటూ విడుదల చేయడం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందన్నారు మంత్రి రోజా.

14 సంవత్సరాలు అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి ఇప్పుడు కొత్తగా పూర్ టూ రిచ్ అనడం కామెడీగా ఉందన్నారు. చంద్రబాబు పరిపాలనలో రెండు ఎకరాల నుంచి 2000 కోట్లకు అధిపతి రిచెస్ట్ ఎమ్మెల్యే అయ్యాడని అన్నారు.

Also Read..Bonda uma : టీడీపీ మ్యానిఫెస్టోతో వైసీపీ పునాదులు కదులుతున్నాయి.. అందుకే భయపడుతున్నారు : బోండా ఉమ

టీడీపీ మేనిఫెస్టోలో వెల్లడించిన ఆరు అంశాల్లో మూడు అంశాలు సీఎం జగన్ అమలు చేస్తున్న పథకాలు, రెండు ఇటీవల కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పథకాలు. ఒకటి బిజెపి పథకం.. వాటిని చంద్రబాబు కాపీ కొట్టారని మంత్రి రోజా అన్నారు. తనకన్నా అనుభవం ఉన్న వారు ఎవరు లేరని చెప్పుకునే వ్యక్తి.. సొంతంగా ఒక పథకం కూడా పెట్టలేకపోయారు అని మంత్రి రోజా విమర్శించారు.

తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క సెంటు భూమి కూడా ఇవ్వలేని వ్యక్తి.. నేడు పేద మహిళలకు ఇచ్చిన భూములను శవాలు పాతిపెట్టడానికా అని ఎగతాళి చేయడం ఎంతవరకు కరెక్ట్? అని మంత్రి రోజా నిలదీశారు.

Also Read..Ambati Rambabu : టీడీపీకి ఇదే చివరి మహానాడు, మళ్లీ వచ్చేది వైసీపీనే- మంత్రి అంబటి రాంబాబు

కాగా.. రాజమండ్రి మహానాడు వేదికపై ఎన్నికల మేనిఫెస్టోని ప్రకటించారు చంద్రబాబు. యువత, మహిళలు, రైతులను ఆదుకుంటామని మేనిఫెస్టోలో ప్రకటించారు.

టీడీపీ మేనిఫెస్టోలోని అంశాలు..

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు జిల్లా పరిధిలో ఉచిత ప్రయాణ సౌకర్యం.
ప్రతి ఇంటికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం.
ప్రతి నిరుద్యోగికి యువగళం నిధి కింద నెలకు రూ.3 వేలు.
ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు
మహిళల కోసం మహాశక్తి కార్యక్రమం.. ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500 మహిళల ఖాతాల్లో వేస్తాం.
18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసు కలిగిన ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి వర్తిస్తుంది.
ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి ఆడబిడ్డ నిధి. నెలకు రూ.1500.
తల్లికి వందనం కింద ప్రతి బిడ్డ తల్లికి ఏటా రూ.15 వేలు.

 

ట్రెండింగ్ వార్తలు