జగన్ కు చేతులెత్తి నమస్కరిస్తున్నా.. రాజధానిపై ఆలోచించాలి : చంద్రబాబు 

జగన్ అంటే నాకు ద్వేషం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. చిన్నవాడైన జగన్ కు చేతులెత్తి నమస్కరిస్తున్నా.. రాజధానిపై ఆలోచించాలని కోరారు.

జగన్ కు చేతులెత్తి నమస్కరిస్తున్నా.. రాజధానిపై ఆలోచించాలి : చంద్రబాబు 

జగన్ అంటే నాకు ద్వేషం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. చిన్నవాడైన జగన్ కు చేతులెత్తి నమస్కరిస్తున్నా.. రాజధానిపై ఆలోచించాలని కోరారు.

జగన్ అంటే నాకు ద్వేషం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. చిన్నవాడైన జగన్ కు చేతులెత్తి నమస్కరిస్తున్నా.. రాజధానిపై ఆలోచించాలని కోరారు. ఈ మేరకు ఆయన సోమవారం (జనవరి 20, 2020) జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ తండ్రిని స్ఫూర్తిగా తీసుకొని రాజధానిని జగన్ పూర్తి చేయాలన్నారు. ప్రపంచంలో ఎక్కడా 3 రాజధానులు విజయవంతం కాలేదని తెలిపారు. రాజకీయంగా తీసుకుంటే మీకు నష్టం..రాష్ట్ర ప్రజలకు నష్టం అన్నారు. 

మూడు రాజధానుల బిల్లుపై ఏపీ అసెంబ్లీలో హాట్ హాట్‌గా చర్చ జరిగింది. ప్రతిపక్ష, అధికార పక్ష సభ్యుల మధ్య మాటల తూటాలు పేలాయి. ప్రతిపక్ష సభ్యులు, అధికారపక్ష సభ్యులు మాట్లాడిన అనంతరం సీఎం జగన్ మాట్లాడారు. అంతకంటే ముందు..బాబు సుదీర్ఘంగా మాట్లాడడంపై జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం చంద్రబాబు మైక్‌ను స్పీకర్ కట్ చేశారు. దీంతో సీఎం జగన్ మాట్లాడేందుకు ప్రయత్నించారు. దీనికి టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ..పోడియం ఎదుట ఆందోళనకు దిగారు. 

మార్షల్ పిలిచి సభ్యులను బయటకు పంపించాలని సీఎం జగన్ సూచించారు. ఏపీ మంత్రి బుగ్గన మార్షల్‌ను పిలిపించారు. మూడు రాజధానులు వద్దు..అమరావతే ముద్దు..అంటూ నినాదాలు చేశారు. ఆందోళన సద్దుమణగకపోవడంతో వారిని 17 మంది సభ్యులను ఒకరోజు సస్పెన్షన్ చేస్తున్నట్లు మంత్రి బుగ్గన ప్రతిపాదించారు. ఒక రోజు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ వెల్లడించారు. 

అచ్చెన్నాయుడు, కరణం బలరాం, నిమ్మల రామానాయుడు, ఆదిరెడ్డి భవాని, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, చిన రాజప్ప, వెంకటిరెడ్డి నాయుడు, వాసుపల్లి గణేశ్, జోగేశ్వరరావు, పయ్యావుల కేశవ్, గద్దె రామ్మోహన్, వెలగపూడి రామకృష్ణ, అనగాని సత్యప్రసాద్, ఏలూరు సాంబశివరావు, గొట్టిపాటి రవి, మంతెన రామరాజు, బాల వీరాంజనేయ స్వామి సస్పెండ్ అయ్యారు.