నన్ను చంపేస్తారనే భయంతో బతికా : వైసీపీ ఎమ్మెల్యే

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు హాట్ హాట్ గా నడుస్తున్నాయి. నాలుగో రోజూ(డిసెంబర్ 12,2019) అధికార, ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం జరిగింది. అసెంబ్లీకి వస్తున్న

  • Published By: veegamteam ,Published On : December 12, 2019 / 05:31 AM IST
నన్ను చంపేస్తారనే భయంతో బతికా : వైసీపీ ఎమ్మెల్యే

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు హాట్ హాట్ గా నడుస్తున్నాయి. నాలుగో రోజూ(డిసెంబర్ 12,2019) అధికార, ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం జరిగింది. అసెంబ్లీకి వస్తున్న

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు హాట్ హాట్ గా నడుస్తున్నాయి. నాలుగో రోజూ(డిసెంబర్ 12,2019) అధికార, ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం జరిగింది. అసెంబ్లీకి వస్తున్న సమయంలో మార్షల్స్ తమను అడ్డుకుని అవమానించారని టీడీపీ సభ్యులు ఆరోపించారు. మార్షల్స్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై సభలో వాడీవేడి చర్చ జరిగింది.

వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. చంద్రబాబు పాలనలో తనను ఘోరంగా అవమానించారని వాపోయరు. చంద్రబాబు పాలనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పాలనలో చంపేస్తారనే భయంతో బతికాను అని చెప్పారు. కులం పేరుతో దూషించాను అని కేసు పెట్టి తనను జైల్లో పెట్టించారని చెవిరెడ్డి చెప్పారు. జైల్లో అధికారులు తనను కాళ్లతో తన్నారని వాపోయారు. నన్ను ఎందుకు తన్నారో చెప్పాలని రెండు రోజులు నిరాహార దీక్ష చేశానని గుర్తు చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డగోలుగా వ్యవహరించింది టీడీపీ నేతలే అని చెవిరెడ్డి ఆరోపించారు.

* గతంలో చంద్రబాబు ఎలా ప్రవర్తించారో తలుచుకుంటే బాధేస్తుంది
* ఆర్డీవో ఆఫీస్ లో నిరసన తెలుపుతుంటే.. నాపై కేసు పెట్టించారు
* కులంపేరుతో దూషించానని సబ్ కలెక్టర్ తో నాపై కేసు పెట్టించి జైల్లో వేశారు
* జైల్లో నన్ను ఎగిరి తన్నారు.. ఎందుకు తన్నారో చెప్పాలని దీక్ష చేశాను
* మరోసారి ధర్నా చేస్తే తమిళనాడుకు తరలించారు
* తీవ్రవాది కంటే దారుణంగా నన్ను కొట్టారు
* ఐదేళ్లు నన్ను ఎంత ఇబ్బంది పెట్టారో ఆ దేవుడికి తెలుసు