చైనాలో కరోనా కంటే రాష్ట్రంలో ఎల్లో వైరస్ ప్రమాదకరమైంది : కొడాలి నాని

  • Published By: chvmurthy ,Published On : February 2, 2020 / 11:00 AM IST
చైనాలో కరోనా కంటే రాష్ట్రంలో ఎల్లో వైరస్ ప్రమాదకరమైంది : కొడాలి నాని

చైనాలో కరోనా కంటే రాష్ట్రంలో ఎల్లోవైరస్ ప్రమాదకరమైందని పౌరసరఫరాలశాఖమంత్రి శ్రీ కొడాలి వెంకటేశ్వరరావు అన్నారు.  రాష్ట్రంలో 55 లక్షలమందికి జగన్  ప్రభుత్వం పెన్షన్లు ఇస్తుంటే ఎల్లోమీడియాలో  ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండి పడ్డారు. చంద్రబాబు పాలనలోరాష్ట్రంలో 39 లక్షలమందికే పెన్షన్లు అందేవని ఇప్పుడు అవి 55 వేలమందికి అందుతున్నాయన్నారు. 
 

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం జగన్ నెరవేరుస్తున్నారని…అమ్మఒడి కింద 82 లక్షలమంది విద్యార్ధులకు పెన్షన్లు అందుతున్నాయని అన్నారు.  వృధ్దులు,వికలాంగులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశ్యంతోనే పెన్షన్లు ఇంటివద్దకే అందించే కార్యక్రమాన్ని సీఎం చేపట్టారని తెలిపారు. 

సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పధకాల అమలుతో రాష్ర్టంలో కోటి మందికి పైగా లబ్ది పొందుతున్నారని…అవేమి చంద్రబాబుకు, ఆయన ఎల్లో మీడియాకు కనపడటంలేదని….. చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణలకు పెన్షన్ రాకపోతే రాష్ర్టంలో ఎవరికీ పెన్సన్ రానట్లా అని ఆయన ప్రశ్నించారు.చంద్రబాబు పెద్ద 420 అని, సీఎంగా జగన్ ను దింపేసి రాష్ర్టాన్ని దోచుకోవాలని చంద్రబాబు చూస్తున్నారని నాని చెప్పారు.  
 

టీడీపీ మాజీ ఎంపీ జేసీ  దివాకర రెడ్డికి వయస్సు వచ్చింది కానీ.. బుద్ది రాలేదని…. నోరు అదుపులో పెట్టుకుని మట్లాడాలని ఆయన అన్నారు. రాష్ర్టంలో అడ్డగోలుగా జేసి బస్సులు  నడుపుతున్నారని.. జగన్ ను విమర్శించే స్దాయి జేసికి లేదని అన్నారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా 29 గ్రామాలలోనే ఉద్యమం జరుగుతోందని… వికేంద్రీకరణ బిల్లును రాష్ర్ట ప్రజలు స్వాగతిస్తున్నారని కొడాలి నాని అన్నారు. 

బిజేపితో చెట్టాపట్టాలేసుకుని తిరిగే నాయకులు ప్రభుత్వంపై విమర్శలు చేస్తారా అని ఆయన యనమల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. యనమలకు మైండ్ పనిచేయడం లేదని….గతంలో కేంద్రంలో బిజేపితో భాగస్వామిగా ఉన్నప్పుడు యనమల రాష్ర్టానికి నిధులు ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. 

రాష్ర్టానికి రావాల్సిన కేటాయింపులపై మా పార్టీ ఎంపీలు పార్లమెంట్ లో కేంద్రాన్ని డిమాండ్ చేస్తారని కొడాలి చెప్పారు. కేంద్రమంత్రులను కలసి జరిగిన అన్యాయాన్ని వివరిస్తారని బడ్జెట్ లో జరిగిన అన్యాయంపై కేంద్రానికి నిరసన తెలియచేస్తామని మంత్రి వివరించారు.