క్లీన్ వార్డు : అన్నీ వైరస్‌లకు ఒకే చోట చికిత్స 

  • Published By: madhu ,Published On : January 30, 2020 / 02:09 AM IST
క్లీన్ వార్డు : అన్నీ వైరస్‌లకు ఒకే చోట చికిత్స 

వైద్య చికిత్స అందించే విధంగా కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. ఇందుకు క్లీన్ వార్డు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగా హైదరాబాద్‌లోని ఫీవర్ ఆస్పత్రిలో ఏర్పాటు చేయాలని అనుకున్నారు. చివరి నిమిషంలో ఛాతీ ఆస్పత్రిలో ఐదెకరాల విశాలమైన స్థలంలో నెలకొల్పాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకు రూ. 132 కోట్లు ఖర్చు పెట్టి వచ్చే ఏడాదికి దీనిని అందుబాటులోకి తీసుకరావాలని, త్వరలోనే భూమి పూజ చేసి నిర్మాణం చేపట్టనుంది. 
 

WHO మార్గదర్శకాల మేరకు…
స్వైన్ ఫ్లూ, కరోనా, నిఫా, ఎబోలా వంటి అత్యంత ప్రమాదకరమైన వైరస్‌లకు చికిత్స అందిస్తున్నారు. ఈ కేంద్రాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా నెలకొల్పనున్నారు. ప్రస్తుతం ఏదైనా వైరస్‌లు వస్తే..గాంధీ, ఫీవర్, చెస్ట్ ఆస్పత్రుల్లో అప్పటికప్పుడు ఏర్పాట్లు చేయడం జరుగుతోంది. అయితే..ఒక్కోసారి కనీస వసతులు లేకపోవడంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

సాధారణ రోగులకు వైద్యం అందించే వార్డులను ప్రత్యేకంగా కేటాయించి చికిత్స అందిస్తున్నారు. దీనివల్ల సాధారణంగా వచ్చే రోగులకు, వైరస్‌ సోకిన వారికి పక్కపక్కనే ఉంచి చికిత్స అందించే పరిస్థితి ఉంది. అందువల్ల ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయడం వల్ల సమస్య పరిష్కారమౌతుందని వైద్య ఆరోగ్య శాఖ భావిస్తోంది. ఇలాంటి ప్రత్యేక చికిత్సా కేంద్రం…ఢిల్లీ, పూణే ప్రాంతాల్లో మాత్రమే ఉంది. 

క్లీన్ వార్డులో 
ప్రోటోకాల్ ప్రకారం చికిత్స అందిస్తున్నారు. క్రిటికల్ కేర్, ఐసోలేషన్, సాధారణ వార్డులుంటాయి. క్రిటికేల్ కేర్, ఐసోలేషన్, సాధారణ వార్డులుంటాయి. క్రిటికల్ కేర్‌లో 20 పడకలుంటాయి. ఐసోలేషన్ వార్డులో 50 – 620 పడకలు, సాధారణ వార్డులో దాదాపు 100 పడకలు ఏర్పాటు చేయనున్నారు. పరీక్షల్లో వైరస్ ఏ విధంగా ఉందో..దానికి సంబంధించిన వార్డులో ఉంచి వైద్య చికిత్స అందిస్తారు.

స్వైన్ ఫ్లూ, కరోనా లాంటి వైరస్‌లు సోకితే..ముందుగా సాధారణ వార్డులో చికిత్స అందిస్తారు. అక్కడ పరిస్థితి తీవ్రతను బట్టి..ఇతర వార్డులకు పంపించే ఏర్పాటు చేస్తారు. ఎబోలా, నిఫా వంటి వైరస్‌లు అత్యంత ప్రమాదకరమైనవని, ఆ వైరస్ లక్షణాలున్న వ్యక్తిని నేరుగా క్రిటికల్ కేర్ వార్డులకు పంపిస్తారు. వార్డుకు వెళ్లడానికి ముందు తగిన జాగ్రత్తలు తీసుకొనే విధంగా చర్యలు తీసుకుంటారు. ప్రత్యేక వైద్య బృందం వీటిని పరీక్షిస్తుంటుంది. 

Read More : ఒక్క క్లిక్‌తో ఫ్యాన్సీ నెంబర్