చంద్రబాబు ఆస్తులు రూ.20కోట్లు, లోకేష్‌ ఆస్తులు రూ.320కోట్లు

టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు.. ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్‌ ఆస్తులు ఐదేళ్లలో భారీగా పెరిగాయి. నామినేషన్‌ సందర్భంగా వారిద్దరు తమ ఆస్తుల వివరాలను

  • Published By: veegamteam ,Published On : March 22, 2019 / 03:40 PM IST
చంద్రబాబు ఆస్తులు రూ.20కోట్లు, లోకేష్‌ ఆస్తులు రూ.320కోట్లు

టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు.. ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్‌ ఆస్తులు ఐదేళ్లలో భారీగా పెరిగాయి. నామినేషన్‌ సందర్భంగా వారిద్దరు తమ ఆస్తుల వివరాలను

టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు.. ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్‌ నామినేషన్లు వేశారు. తమ ఆస్తిపాస్తుల వివరాలను అఫిడవిట్‌లో పేర్కొన్నారు. నగదు, బంగారం, స్థిర, చరాస్తులు, అప్పుల వివరాలను స్పష్టంగా వెల్లడించారు. ఇందులో చంద్రబాబు మొత్తం ఆస్తుల విలువ 20.44 కోట్లు… రూ.5కోట్లకు పైగా అప్పులున్నాయి. బాబు ఆస్తులకన్నా ఆయన భార్య భువనేశ్వరి ఆస్తులు చాలా ఎక్కువ. భువనేశ్వరి మొత్తం ఆస్తులు రూ.648.13కోట్లు. అప్పులు మాత్రం రూ.10 కోట్లున్నాయి.

ఇక లోకేష్‌కు రూ.320.45కోట్ల ఆస్తులున్నాయి. రూ.5.72 కోట్ల అప్పులు కూడా లోకేష్‌కు ఉన్నాయి. లోకేష్ భార్య బ్రాహ్మణి ఆస్తులు రూ.33.15 కోట్లు, అప్పులు రూ.3 కోట్ల 41లక్షలు… ఇక దేవాన్ష్‌ మొత్తం ఆస్తుల విలువ రూ. 20 కోట్లకు కాస్త ఎక్కువే.

కుప్పం టీడీపీ అసెంబ్లీ అభ్యర్థిగా చంద్రబాబు బరిలోకి దిగనున్నారు. చంద్రబాబు తరఫున స్థానిక టీడీపీ నేతలు శుక్రవారం(మార్చి 22) నామినేషన్‌ దాఖలు చేశారు. మంగళగిరి టీడీపీ అసెంబ్లీ అభ్యర్థిగా లోకేష్‌ పోటీ చేయనున్నారు.

* చంద్రబాబు ఆస్తులు రూ.20.44 కోట్లు
* అప్పులు రూ.5కోట్లు
* భువనేశ్వరి ఆస్తులు రూ.648.13 కోట్లు.. అప్పులు రూ.10 కోట్లు
* లోకేష్‌ ఆస్తుల విలువ రూ.320.45కోట్లు
* అప్పులు రూ.5.72 కోట్లు
* బ్రాహ్మణి ఆస్తులు రూ.33.15 కోట్లు, అప్పులు రూ.3 కోట్ల 41లక్షలు
* దేవాన్ష్‌ ఆస్తుల విలువ రూ. 20 కోట్లు