రోడ్డు ఎక్కుతారా : తమ్ముళ్లపై చంద్రబాబు సీరియస్

ఏపీ సీఎం చంద్రబాబుకి కోపం వచ్చింది. పార్టీ అసమ్మతి నేతలపై ఆయన సీరియస్ అయ్యారు. అసమ్మతి పేరుతో జిల్లాల్లో సమావేశాలు పెట్టడంపై చంద్రబాబు తప్పుపట్టారు. అందరి

రోడ్డు ఎక్కుతారా : తమ్ముళ్లపై చంద్రబాబు సీరియస్

ఏపీ సీఎం చంద్రబాబుకి కోపం వచ్చింది. పార్టీ అసమ్మతి నేతలపై ఆయన సీరియస్ అయ్యారు. అసమ్మతి పేరుతో జిల్లాల్లో సమావేశాలు పెట్టడంపై చంద్రబాబు తప్పుపట్టారు. అందరి

ఏపీ సీఎం చంద్రబాబుకి కోపం వచ్చింది. పార్టీ అసమ్మతి నేతలపై ఆయన సీరియస్ అయ్యారు. అసమ్మతి పేరుతో జిల్లాల్లో సమావేశాలు పెట్టడంపై చంద్రబాబు తప్పుపట్టారు. అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అభిప్రాయాలను పార్టీ దృష్టికి తీసుకురాకుండా మీడియాకు ఎక్కేలా వ్యవహరించడంపై చంద్రబాబు మండిపడ్డారు. అసమ్మతి సమావేశాలు పెట్టిన నేతలను అమరావతికి పిలిపించి సంజాయిషీ కోరాలని చంద్రబాబు ఆదేశించారు. పార్టీలో క్రమశిక్షణరాహిత్యాన్ని ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించమని నేతలకు చంద్రబాబు స్పష్టం చేశారు.

కొన్ని రోజులుగా అభ్యర్థులను ఖరారు చేసే విషయమై పార్లమెంటరీ స్థానాల వారీగా చంద్రబాబు సమీక్షలు నిర్వహిస్తున్నారు. టికెట్లు ఆశించి భంగపడ్డ నాయకులు అమస్మతి స్వరం వినిపిస్తున్నారు కొన్ని చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ముఠాలు కట్టి గొడవలు పడటం చంద్రబాబు దృష్టికి వచ్చింది. ఎస్సీ నియోజకవర్గాల్లో పరిస్థితి చేయి దాటిపోవడం కలవర పెట్టింది. వెంటనే అలర్ట్ అయిన చంద్రబాబు.. పరిస్థితిని చక్కదిద్దే చర్యలు చేపట్టారు.

క్రమశిక్షణకు కట్టుబడకుండా వివాదాలు సృష్టిస్తున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. కొవ్వూరు నియోజకవర్గంలో మంత్రి జవహర్‌కి వ్యతిరేకంగా అక్కడ ముఠా కట్టి రోడ్కెక్కిన పరిస్థితి ఉంది. తాడికొండ, సంతనూతలపాడు నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి. ఎవరికి వారు యమునా తీరు అనేలా వ్యవహరిస్తున్నారు. అధిష్టానం నిర్ణయాలకు వ్యతిరేకంగా దీక్షలు చేస్తున్నారు, వ్యాఖ్యలు చేస్తున్నారు. పార్టీ అధిష్టానం నిర్ణయించిన అభ్యర్థికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. దీంతో చంద్రబాబు సీరియస్ అయ్యారు. పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉండాల్సిందే అని చంద్రబాబు తేల్చి చెప్పారు. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. పార్టీ అధికారంలోకి వస్తే ఎలాంటి రాజకీయ, అధికార పదవులు ఇచ్చేది లేదని వార్నింగ్ ఇచ్చారు.