ఏం జరుగుతోంది : అమిత్ షా అపాయింట్ మెంట్ అడిగిన సీఎం జగన్

ఏపీ సీఎం జగన్ ఢిల్లీ బయల్దేరనున్నారు. రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే పర్యటించనున్నారు. డిసెంబర్ 5వ తేదీ సాయంత్రం 6 గంటలకు జగన్ ఢిల్లీ చేరుకుంటారు.

  • Published By: veegamteam ,Published On : December 5, 2019 / 10:28 AM IST
ఏం జరుగుతోంది : అమిత్ షా అపాయింట్ మెంట్ అడిగిన సీఎం జగన్

ఏపీ సీఎం జగన్ ఢిల్లీ బయల్దేరనున్నారు. రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే పర్యటించనున్నారు. డిసెంబర్ 5వ తేదీ సాయంత్రం 6 గంటలకు జగన్ ఢిల్లీ చేరుకుంటారు.

ఏపీ సీఎం జగన్ ఢిల్లీ బయల్దేరనున్నారు. రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే పర్యటించనున్నారు. డిసెంబర్ 5వ తేదీ సాయంత్రం 6 గంటలకు జగన్ ఢిల్లీ చేరుకుంటారు. రేపు(డిసెంబర్ 7,2019) ప్రధాని మోడీతో సీఎం జగన్ భేటీ అవుతారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్‌మెంట్ కూడా సీఎంవో కోరింది. విభజన హామీలు, రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపైనే చర్చిస్తారని తెలుస్తోంది.

సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ఏపీ రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది. అసలే ఏపీలో రాజకీయం వేడెక్కింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కామెంట్స్ అగ్గి రాజేశాయి. ఈ దేశ రాజకీయాలకు అమిత్ షా లాంటి వ్యక్తే కరెక్ట్ అని పవన్ అన్నారు. బీజేపీతో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. ప్రధాని మోడీపైనా ప్రశంసలు కురిపించారు. అమిత్ షా అంటే వైసీపీకి భయం.. నాకు గౌరవం అన్నారు. పవన్ కామెంట్స్ చూస్తుంటే.. జనసేనని బీజేపీలో విలీనం చేసేందుకు రెడీ అయినట్టు కనిపిస్తోందని వైసీపీ నేతలు కామెంట్ చేశారు.

మొన్నటి దాకా మోడీ, అమిత్ షా లను తీవ్రంగా విమర్శించిన పవన్.. ఢిల్లీ నుంచి వచ్చాక సడెన్ గా మారిపోయారని అంటున్నారు. ఢిల్లీలో పవన్ ఎవరిని కలిశారు, ఏం మాట్లాడారు అనేది ఎవరికీ తెలియదు. బీజేపీకి దగ్గరయ్యేలా కామెంట్స్ చేస్తున్న పవన్.. ఏపీలో జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ఓ రేంజ్ లో సీఎం జగన్ పై విరుచుకుపడుతున్నారు. ప్రభుత్వంతో సై అంటే సై అంటున్నారు. ఈ క్రమంలో జగన్ ఢిల్లీ పర్యటన ఆసక్తి రేపింది.

Read More : జగన్..నాతో పెట్టుకుంటే కుర్చీ కూలుతుంది