నేతన్నల ప్రతిభ : పట్టుచీరలపై KCR, KTR చిత్రాలు

  • Published By: madhu ,Published On : February 9, 2020 / 07:26 AM IST
నేతన్నల ప్రతిభ : పట్టుచీరలపై KCR, KTR చిత్రాలు

భారతేదేశంలో స్త్రీలు ధరించే దుస్తులలో ముఖ్యమైంది చీర. పాశ్చాత్య వాసనలు ఎన్ని ఉన్నా..చీర స్థానం చీరదే. స్త్రీల సౌందర్యాన్ని పెంచుతుంటాయి. వెరైటీ…డిజైన్లలో మహిళలు ఆకట్టుకొనే విధంగా చీరలు తయారు చేస్తుంటారు వ్యాపారులు. కొంతమంది తమ కళాత్మకతను చీరల్లో పొందుపరుస్తుంటారు. నేత కార్మికులు వినూత్నంగా తయారు చేసిన చీరలకు ఫుల్ డిమాండ్ ఉంటుంది.

అగ్గిపెట్టెలో పట్టే చీరలను తయారు చేసిన ఘటనలు మనం చూశాం. ఇటీవలే దీనిపై ఓ సినిమా కూడా వచ్చిన సంగతి తెలిసిందే. పద్మశ్రీ చింతకింది మల్లేశం జీవితం ఆధారంగా మల్లేశం అనే సినిమా వచ్చింది. అగ్గిపెట్టెలో పట్టేంత చిన్న చీరలను తయారు చేసి ప్రపంచాన్ని అబ్బుపరిచాడు నేతన్న మల్లేశం. 
 

అసలు విషయం ఏమిటంటే…
తెలంగాణ రాష్ట్ర విషయానికి వస్తే..సిరిసిల్ల నేతలు నేసిన చీరలు ఎంతో ప్రాచుర్యం పొందారు. దసరా పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ఆడపడుచులకు ఇచ్చే చీరలను ఇక్కడి నుంచే తయారు చేయిస్తోంది. తాజాగా సిరిసిల్ల నేతలు నేసిన చీరలను అందర్నీ ఆకర్షిస్తున్నాయి. ఎందుకంటే..ఏకంగా సీఎం కేసీఆర్, మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిత్రాలను చీరలపై వేసిన అబ్బుపరిచారు. ఈ విషయాన్ని తిరుపతి భండారి ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. ఎలక్ట్రానిక్ జకర్డుతో పట్టు చీరలను తయారు చేసినట్లు వెల్లడించారు. జకార్డుతో సిరిసిల్ల నేతలు అద్బుతాలు సృష్టిస్తున్నారంటూ..ఫొటోలతో ట్వీట్ చేశారాయన. నేతలను ప్రతిభ చూసి పలువురు మెచ్చుకుంటున్నారు.