ఖమ్మం జిల్లాకు నీటిని వదలండి : సీఎం కేసీఆర్ ఆదేశాలు

ఖమ్మం జిల్లాలో 2 లక్షల ఎకరాల్లో పంటను కాపాడేందుకు... నాగార్జున సాగర్ ఎడమ కాల్వ నుంచి వెంటనే నీరు విడుదల చేయాలని సీఎం కేసీఆర్‌... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.

  • Published By: veegamteam ,Published On : March 2, 2019 / 11:38 AM IST
ఖమ్మం జిల్లాకు నీటిని వదలండి : సీఎం కేసీఆర్ ఆదేశాలు

ఖమ్మం జిల్లాలో 2 లక్షల ఎకరాల్లో పంటను కాపాడేందుకు… నాగార్జున సాగర్ ఎడమ కాల్వ నుంచి వెంటనే నీరు విడుదల చేయాలని సీఎం కేసీఆర్‌… ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.

ఖమ్మం జిల్లాలో 2 లక్షల ఎకరాల్లో పంటను కాపాడేందుకు… నాగార్జున సాగర్ ఎడమ కాల్వ నుంచి వెంటనే నీరు విడుదల చేయాలని సీఎం కేసీఆర్‌… ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషిని  ఆదేశించారు. సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య విజ్ఞప్తి మేరకు సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. సత్తుపల్లి, ఖమ్మం, పాలేరు, వైరా, మధిర నియోజకవర్గాల్లో 2లక్షల ఎకరాల్లో మెట్ట,  ఆరుతడి పంటలు సాగుచేస్తున్నారని.. ఆ పంటలకు ప్రస్తుతం నీరు అవసరమని, 10 రోజుల పాటు నాగార్జున సాగర్ ఎడమకాల్వ నుంచి నీరు అందించి, పంటలను కాపాడాలని ఎమ్మెల్యే సీఎంను  కోరారు. దీనిపై స్పందించిన కేసీఆర్ వెంటనే నీరు విడుదల చేయాలని ఆదేశించారు. సమస్యను రాజకీయ కోణంలో కాకుండా రైతాంగం కోణంలో సీఎం కేసీఆర్ చూడటం పట్ల ఎమ్మెల్యే సండ్ర..  ఆనందం వ్యక్తం చేశారు.

శనివారం(మార్చి-2-2019) ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కలిశారు. సాగర్‌ ఎడమకాల్వ నుంచి నీరు విడుదల చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.  టీడీపీ ఎమ్మెల్యే సండ్ర..సీఎం కేసీఆర్‌ను కలవడం రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది. వీరి భేటీ టీడీపీ శ్రేణుల్లో కలవరం నింపింది. సండ్ర… టీఆర్‌ఎస్‌లోకి వెళ్తున్నారని, ఆయనకు మంత్రి కూడా  ఖాయమైందనే ప్రచారం జరిగింది.

టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కేసీఆర్‌ను కలవడం టీడీపీలోనే కాదు కాంగ్రెస్ శ్రేణుల్లోనూ ఆందోళన నింపింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఆశలు గల్లంతైనట్టే అని రాజకీయవర్గాల్లో ప్రచారం  జరుగుతోంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థిని పోటీలో నిలిపిన కాంగ్రెస్… టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు సండ్ర రయ్య, మచ్చా నాగేశ్వరరావు తమకు ఓటేస్తే తమ అభ్యర్థి గెలిచినట్టే  అని భావిస్తోంది. టీడీపీ మద్దతు కోసం టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా టీడీపీ చీఫ్ చంద్రబాబుకి ఫోన్ కూడా చేశారు.

ఇదే సమయంలో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సీఎం కేసీఆర్‌ను కలవడంతో… ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని  వార్తలొస్తున్నాయి. కేసీఆర్ సండ్ర మధ్య ఎమ్మెల్సీ ఎన్నికల అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్టు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. మంత్రివర్గ విస్తరణకు ముందే టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో  చేరతారని భావించారు. కానీ చేరలేదు. ఇప్పుడు వారు కారెక్కుతారా లేదా అన్నది ఎమ్మెల్సీ ఎన్నికలతో తేలిపోనుందని సమాచారం.