CAA వద్దే వద్దు: గోలీ మారో సాలోంకు అంటారా ? ఏం భాష – కేసీఆర్

  • Published By: madhu ,Published On : March 16, 2020 / 05:59 AM IST
CAA వద్దే వద్దు: గోలీ మారో సాలోంకు అంటారా ? ఏం భాష – కేసీఆర్

పార్లమెంట్ సభ్యులు, కొంతమంది మంత్రులు చేసిన వ్యాఖ్యలు చాలా బాధించాయన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. ‘గోలీ మారో సాలోంకు’ అంటారా ? ఏం భాష అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాత్కాలికంగా ఉద్రిక్తలు సృష్టించి..రాక్షసానందం పొందడం శ్రేయస్కరం కాదని హితవు పలికారాయన. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. 2020, మార్చి 16వ తేదీ సోమవారం ఉదయం ప్రారంభమైన సభలో CAA వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టారు.

ఈ సందర్భంగా..సీఎం కేసీఆర్ మాట్లాడుతూ…
రాజకీయంగా విభేదాలున్నా..పర్యటించే సమయంలో కొంత సంయమనం పాటించాల్సి ఉంటుందన్నారు. స్వయంగా అమెరికా అధ్యక్షుడు భారత దేశంలో పర్యటించే సమయంలో 50మంది పౌరులు చనిపోయారని గుర్తు చేశారు. ఎన్నో సంవత్సరాలుగా పదవిలో ఉన్న సమయంలో ఇలాంటి మాటలు వినడం మనస్సుకు చాలా బాధించిందన్నారు. అంతర్జాతీయంగా ఉన్న ఖ్యాతీ, రాజ్యాంగానికి పూర్తి విరుద్ధమన్నారు. దేశంలో ఎన్నో సమస్యలున్నాయని, ఈ సమయంలోనే ఇలాంటి చట్టం తీసుకరావడం కరెక్టు కాదన్నారు. 

హిందూ – ముస్లిం సమస్య కాదు..భారతదేశ సమస్యగా అభివర్ణించారు. తనకే బర్త్ డే సర్టిఫికేట్ లేదని, ఆ సమయంలో ఆసుపత్రిలో లేవని..ఇప్పుడు సర్టిఫికేట్ తేవాలని అంటే..ఎక్కడి నుంచి తేవాలని సభలో ప్రశ్నించారు. తనలాంటి వ్యక్తులు అనేక మంది ఉన్నారన్నారు. తన పరిస్థితి ఇలా ఉంటే..సామాన్యుడి పరిస్థితి ఏంటీ ? అని నిలదీశారు.  తాను చేసిన ఈ వ్యాఖ్యలపై ఏవోవో వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు కేసీఆర్.

 

* దేశంలో ఉన్నటువంటి సెక్యులర్ వాదులు, ప్రజాస్వామ్య వాదులు, భారత రాజ్యంగ లౌకికత్వం పట్ల తమ తమ పద్ధతుల్లో విధానాలు, నిరసనలు తెలియచేస్తున్నారు.
* పార్లమెంట్‌లో లోక్ సభ, రాజ్యసభలో వచ్చిన సమయంలో తాము తిరస్కరించాం. 
 

* ఇప్పటికే ఏడు రాష్ట్రాలు తీర్మానం చేశాయి. తెలంగాణ 8వ రాష్ట్రమన్నారు.
* మధ్యప్రదేశ్ రాష్ట్రం మాత్రం కేబినెట్ తీర్మానం చేసింది. 
Read More ; కరోనాకి భయపడొద్దు, ఢిల్లీలో కొవిడ్ వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్న తొలి వ్యక్తి ఇతడే