రాజమండ్రి నుంచి అలీ పోటీ : మంత్రి అయినా ఆశ్చర్యం లేదు

  • Edited By: madhu , January 4, 2019 / 06:16 AM IST
రాజమండ్రి నుంచి అలీ పోటీ : మంత్రి అయినా ఆశ్చర్యం లేదు

విజయవాడ : కమెడియన్ అలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఎందుకు జాయిన్ అవుతున్నారు.. ఏం టీడీపీలోనో.. జనసేన పార్టీల్లో ఎందుకు చేరటం లేదు.. దీని వెనక ఉన్న కారణాలు ఏంటీ.. పొలిటికల్ ఎంట్రీలో అలీకి ఉన్న అడ్వాంటేజీస్ ఏంటీ.. పొలిటికల్ కెరీర్ ఎలా ఉండబోతున్నది అనేది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. అందరిలో ఇదే క్వశ్చన్ రైజ్ అవుతుంది. అలీ పొలిటికల్ ఎంట్రీలో లోగుట్టును చూద్దాం…
Read More : పవన్ క్లోజ్ ఫ్రెండ్ అలీ.. జగన్ పార్టీలో జాయిన్

జగన్ పార్టీలో మైనార్టీ లీడర్స్ కొరత :
టీడీపీతో పొల్చుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మైనార్టీ నేతల కొరత ఉంది. సినీ చరిష్మా ఉన్న లీడర్స్ కూడా తక్కువే. ఇటీవలే పోసానీ, పృద్వీలు తమ వాయిస్ వినిపిస్తున్నారు. ఇప్పుడు అలీ జాయిన్ కావటంతో మైనార్టీ వర్గం కింద మరో సినీ స్టార్ వాయిస్ వైఎస్ఆర్ నుంచి రాబోతున్నది. రాష్ట్ర, జాతీయ రాజకీయ పరిణామాలపై మైనార్టీ కోటా కింద పార్టీ నుంచి మాట్లాడగలిగిన, చురకలు అంటించగలిగిన, పంచ్ లు వేయగలిగిన ఓ నేత దొరికినట్లు అవుతుంది పార్టీకి. అలీ అంటే మాటకారి, కమెడియన్, విషయం ఏదైనా తనదైన శైలిలో చెబుతూ నవ్వించగలడు.. నవ్వులపాలు కూడా చేయగలడు ప్రత్యర్థులను. ఇది కూడా అలీకి బాగా కలిసివచ్చే అంశం.
బెజవాడ లేదా రాజమండ్రి సీటు :
విజయవాడ లేదా రాజమండ్రి నుంచి అలీ పోటీ చేసే ఛాన్స్ ఉంది. జలీల్ ఖాన్ టీడీపీలోకి వెళ్లిపోయాడు.. ఆ నియోజకవర్గం నుంచి అలీని దించాలనే ఆలోచన కూడా పార్టీ చేస్తోంది. దీనికితోడు అలీ సొంత జిల్లా, నియోజకవర్గం అయిన రాజమండ్రి నుంచి పోటీకి ఉబలాటపడుతున్నాడు ఈ యాక్టర్. ఈ రెండు స్థానాల్లో ఏదో ఒక చోట నుంచి పోటీకి రంగంలోకి దిగాలని గట్టిగా నిర్ణయించుకున్నా.. జగన్ ఫైనల్ డెసిషల్ ఎలా ఉండబోతున్నది అనేది ఆసక్తి రేపుతోంది. చివరి నిమిషంలో ఏమైనా జరగొచ్చు రాజకీయాల్లో.. అప్పటి వరకు సస్పెన్స్ థ్రిల్లరే స్టోరీలే…