Bihar DyCM: ముఖ్యమంత్రి పదవిపై తేజశ్వీ యాదవ్ కీలక వ్యాఖ్యలు

కొద్ది రోజుల క్రితం బీజేపీతో తెగతెంపులు చేసుకున్న నితీశ్ కుమార్.. తేజశ్వీ నేతృత్వంలోని ఆర్జేడీతో జత కట్టారు. అనంతరం ముఖ్యమంత్రిగా నితీశ్, ఉప ముఖ్యమంత్రిగా తేజశ్వీ ప్రమాణ స్వీకారం చేశారు. ఇది గడిచిన కొద్ది రోజుల అనంతరమే దేశ రాజకీయాలపై నితీశ్ దృష్టి పెట్టారు. ఇక అప్పటి నుంచి నితీశ్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లనున్నారని, బిహార్ ముఖ్యమంత్రి తేజశ్వీ అవుతారని పుకార్లు షికార్లు కొడుతున్నాయి.

Bihar DyCM: ముఖ్యమంత్రి పదవిపై తేజశ్వీ యాదవ్ కీలక వ్యాఖ్యలు

comments of Tejashwi Yadav on the post of Chief Minister

Bihar DyCM: భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా దేశంలోని విపక్ష పార్టీలన్నింటినీ ఏకం చేసే పనిలో ఉన్నారు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్. కాగా, తొందరలోనే నితీశ్.. పూర్తి స్థాయిలో జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారని, అనంతరం బిహార్ ముఖ్యమంత్రిగా తేజశ్వీ యాదవ్ ప్రమాణ స్వీకారం చేస్తారనే ప్రచారం కొద్ది రోజులుగా జోరుగా సాగుతోంది. ఈ విషయమై తాజాగా తేజశ్వీని ప్రశ్నించగా.. ముఖ్యమంత్రి అవ్వడంపై అంత తొందరేం లేదంటూ సమాధానం ఇచ్చారు. అంటే, రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి అవుతారని తేజశ్వీ పరోక్షంగా క్లారిటీ ఇచ్చేశారు.

శనివారం ఓ కార్యక్రమంలో తేజశ్వీ యాదవ్ మాట్లాడుతూ ‘‘ఇప్పుడప్పుడే ముఖ్యమంత్రి అవ్వాలనే తొందర ఏం లేదు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలోకి మరోసారి ఫాసిస్టు శక్తులు రాకుండా అడ్డుకునే ప్రయత్నంలో బిజీగా ఉన్నాను. అలాగే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఎలా ఓడించాలనే విషయంలో నితీశ్ కుమార్‭కి సహకారం అందిస్తున్నాను’’ అని అన్నారు.

కొద్ది రోజుల క్రితం బీజేపీతో తెగతెంపులు చేసుకున్న నితీశ్ కుమార్.. తేజశ్వీ నేతృత్వంలోని ఆర్జేడీతో జత కట్టారు. అనంతరం ముఖ్యమంత్రిగా నితీశ్, ఉప ముఖ్యమంత్రిగా తేజశ్వీ ప్రమాణ స్వీకారం చేశారు. ఇది గడిచిన కొద్ది రోజుల అనంతరమే దేశ రాజకీయాలపై నితీశ్ దృష్టి పెట్టారు. ఇక అప్పటి నుంచి నితీశ్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లనున్నారని, బిహార్ ముఖ్యమంత్రి తేజశ్వీ అవుతారని పుకార్లు షికార్లు కొడుతున్నాయి.

5G in India: 5జీ లింక్ ఉపయోగించి.. స్వీడన్ నుంచి ఢిల్లీకి కారు నడిపిన ప్రధాని మోదీ