Maharashtra Politics: దేవేంద్ర ఫడ్నవీస్‭ పరిస్థితి కమిషనర్ నుంచి కానిస్టేబుల్‭కు దిగజారిందట!

ఫడ్నవీసే తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని, ఆయన ఇతరులను సంతృప్తి పరచడం అసాధ్యమని రౌత్ అన్నారు. షిండే వర్గంలోని 22 మంది ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎంపీలు బీజేపీ, శివసేన కూటమి ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారంటూ మంగళవారం ఉద్ధవ్ థాకరే అధికారిక పత్రిక సామ్నాలో సంపాదకీయం వచ్చింది

Maharashtra Politics: దేవేంద్ర ఫడ్నవీస్‭ పరిస్థితి కమిషనర్ నుంచి కానిస్టేబుల్‭కు దిగజారిందట!

Sanjay Raut hits Fadnavis: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పరిస్థితి కమిషనర్ నుంచి కానిస్టేబుల్‭కు దిగజారిందని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ అన్నారు. ముఖ్యమంత్రిగా ఉండాల్సిన వ్యక్తం తన కంటే జూనియర్ అయిన వ్యక్తి ముందు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నందుకు ఫడ్నవీస్ అలాగే ఆలోచిస్తున్నారని ఆయన అన్నారు. భారతీయ జనతా పార్టీ అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఫడ్నవీస్ చాలా అసంతృప్తిలో ఉన్నారన్న రౌత్.. అలాంటి భావనలన్నీ ఫడ్నవీస్ ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్నాయని అన్నారు.

AP Politics: మా పాలన చూసి చంద్రబాబుకు నవ నాడులు చిట్లి పోయాయి.. మంత్రి రోజా

‘‘సంతృప్తిగా ఉన్నారా అని వెళ్లి దేవేంద్ర ఫడ్నవీస్‭ని అడగండి. ఆయన చెప్పకపోయినా ఆయన ముఖం చేస్తేనే తెలిసిపోతుంది. అసంతృప్తి ఆయన కళ్లలో స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యమంత్రి కుర్చీలో ఉండాల్సిన వ్యక్తి, తన కంటే రాజకీయాల్లో జూనియర్ అయిన వ్యక్తి ముందు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నందుకు చాలా ఇబ్బందిగా ఉన్నారు. ఆయన పరిస్థితి ఇప్పుడెలా ఉందంటే.. కమిషనర్ స్థాయి వ్యక్తి కానిస్టేబుల్‭కు దిగజారినట్టుంది’’ అని సంజయ్ రౌత్ అన్నారు.

Go Back Modi: ‘మోదీ గో బ్యాక్’.. రాజస్థాన్ పర్యటన సందర్భంగా విరుచుకుపడుతున్న నెటిజెన్లు

ఫడ్నవీసే తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని, ఆయన ఇతరులను సంతృప్తి పరచడం అసాధ్యమని రౌత్ అన్నారు. షిండే వర్గంలోని 22 మంది ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎంపీలు బీజేపీ, శివసేన కూటమి ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారంటూ మంగళవారం ఉద్ధవ్ థాకరే అధికారిక పత్రిక సామ్నాలో సంపాదకీయం వచ్చింది. అయితే ఉద్ధవ్ థాకరేలోని వర్గంలోని అందరూ అసంతృప్తిగా ఉన్నారంటూ ఫడ్నవీస్ వ్యాఖ్యానించారు. ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ రౌత్ పై విధంగా అన్నారు.