కాంగ్రెస్‌లో కామనేగా : కాంగ్రెస్ ఆఫీస్‌పై దాడి, ఫర్నీచర్ ధ్వంసం

పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఉద్రిక్తలకు దారితీస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్‌లో రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఓ వర్గం నేతలు కాంగ్రెస్‌ కార్యాలయంపై దాడిచేసి ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు..

  • Published By: veegamteam ,Published On : January 21, 2019 / 02:14 PM IST
కాంగ్రెస్‌లో కామనేగా : కాంగ్రెస్ ఆఫీస్‌పై దాడి, ఫర్నీచర్ ధ్వంసం

పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఉద్రిక్తలకు దారితీస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్‌లో రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఓ వర్గం నేతలు కాంగ్రెస్‌ కార్యాలయంపై దాడిచేసి ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు..

భద్రాద్రి కొత్తగూడెం : పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఉద్రిక్తలకు దారితీస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్‌లో రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఓ వర్గం నేతలు కాంగ్రెస్‌ కార్యాలయంపై దాడిచేసి ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు.. టేకులపల్లి మండలం కోయగూడెం సర్పంచ్ టికెట్‌ను తమ వర్గానికి ప్రకటించలేదనే ఆగ్రహంతో కాంగ్రెస్ నాయకులు రెచ్చిపోయారు. కోయగూడెం చాలా ప్రాధాన్యత కలిగిన గ్రామం. మేజర్ పంచాయతీ కావడంతో అధికార పార్టీని కాదని ఇల్లెందు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ను గెలిపించారు. తొలిసారి ఓ గిరిజన మహిళను ఎమ్మెల్యేగా గెలిపించారు. సర్పంచ్ టికెట్ ఆశిస్తే ఇప్పటివరకు అభ్యర్థిని ఖరారు చేయకుండా ఇతరులకు ఖరారు చేస్తున్నారనే అసహనంతో కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. మండల కార్యాయలయంలో ఉన్న పార్టీ ఆఫీస్‌పై దాడి చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏకగ్రీవం కోసం ప్రయత్నం చేసినా పోటీలో ఉంటామని చెప్పడంతో… ఎమ్మెల్యే తీరుకి నిరసనగా కాంగ్రెస్ కార్యకర్తుల దాడికి పాల్పడ్డారు.

* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోయగూడెంలో కాంగ్రెస్‌ కార్యకర్తల ఆందోళన
* సర్పంచ్‌ పదవి తమ వర్గానికి ఇవ్వలేదని కాంగ్రెస్ కార్యాలయంపై దాడి
* ఫర్నీచర్‌ ధ్వంసం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు
* సర్పంచ్ పదవి ఏకగ్రీవం చేయలేదని ఆగ్రహం
* ఎమ్మెల్యే తీరుపై తీవ్ర అసహనం