Congress Claims Credit for ‘Project Cheetah’: భారత్‌కు చీతాలు వస్తున్నాయంటే ఆ గొప్పదనం మాదే: కాంగ్రెస్

వన్యప్రాణులు చీతాలను నమీబియాలోని విండ్‌హాక్‌ నుంచి భారత్ కు తీసుకువస్తున్న నేపథ్యంలో.. ఆ గొప్పదనం తమదేనని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ‘‘2008-09లో అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ సర్కారు చీతా ప్రాజెక్టు ప్రతిపాదనలను రూపొందించి, ఆమోద ముద్ర వేసింది. 2010 ఏప్రిల్‌లో అప్పటి కేంద్ర అటవీ పర్యావరణ, శాఖ మంత్రి జైరాం రమేశ్ దక్షిణాఫ్రికాలోని చీతా ఔట్‌ రీచ్ కేంద్రానికి వెళ్లారు. 2013లో భారత సుప్రీంకోర్టు ఈ ప్రాజెక్టును నిలిపేసింది. మళ్ళీ 2020లో ఆ నిషేధాన్ని ఎత్తివేసింది’’ అని కాంగ్రెస్ పార్టీ ట్విటర్ లో పేర్కొంది.

Congress Claims Credit for ‘Project Cheetah’: భారత్‌కు చీతాలు వస్తున్నాయంటే ఆ గొప్పదనం మాదే: కాంగ్రెస్

Congress Claims Credit for ‘Project Cheetah’

Congress Claims Credit for ‘Project Cheetah’: వన్యప్రాణులు చీతాలను నమీబియాలోని విండ్‌హాక్‌ నుంచి భారత్ కు తీసుకువస్తున్న నేపథ్యంలో.. ఆ గొప్పదనం తమదేనని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ‘‘2008-09లో అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ సర్కారు చీతా ప్రాజెక్టు ప్రతిపాదనలను రూపొందించి, ఆమోద ముద్ర వేసింది. 2010 ఏప్రిల్‌లో అప్పటి కేంద్ర అటవీ పర్యావరణ, శాఖ మంత్రి జైరాం రమేశ్ దక్షిణాఫ్రికాలోని చీతా ఔట్‌ రీచ్ కేంద్రానికి వెళ్లారు. 2013లో భారత సుప్రీంకోర్టు ఈ ప్రాజెక్టును నిలిపేసింది. మళ్ళీ 2020లో ఆ నిషేధాన్ని ఎత్తివేసింది’’ అని కాంగ్రెస్ పార్టీ ట్విటర్ లో పేర్కొంది.

అప్పట్లో చీతా ఔట్‌ రీచ్ కేంద్రంలో చీతాతో జైరాం రమేశ్‌, అక్కడి సిబ్బంది ఉన్న ఫొటోను కాంగ్రెస్ పార్టీ షేర్ చేసింది. జైరాం రమేశ్ కూడా దీనిపై స్పందిస్తూ అప్పట్లో రన్ చీతా రన్ పేరిట ఓ ఆంగ్ల దినపత్రికలో వచ్చిన కథనాన్ని పోస్ట్ చేశారు. ‘‘ఇవాళ చీతాలు కునో నేషనల్‌ పార్కుకు వస్తున్న నేపథ్యంలో ఈ ఆర్టికల్ షేర్ చేస్తున్నాను. అప్పట్లో జూలై 30న నేను ఈ ఆర్టికల్ రాశాను. ఇవాళ చీతాలను తీసుకురావడం సాధ్యం కావడానికి అప్పట్లో మేము ఎంతగా కృషి చేశామో ఇందులో చెప్పాను’’ అని జైరాం రమేశ్ చెప్పారు.

కాగా, భారత వైమానిక దళాని(ఐఏఎఫ్‌)కి చెందిన చినూక్‌ హెలికాప్టర్లలో మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఉన్న మహారాజ్‌పుర వైమానిక స్థావరానికి మొదట చీతాలు వస్తాయి. అక్కడి నుంచి చీతాలను కునో నేషనల్‌ పార్కుకు తరలిస్తారు.

Rainfall alert for Telangana: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం