West Bengal: కాంగ్రెస్‭కు గుండు సున్నా.. పార్టీకి హ్యాండ్ ఇచ్చిన ఏకైక ఎమ్మెల్యే

2016 నాటి బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 44 స్థానాలు సాధించి ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 12.25 శాతం ఓట్లు వచ్చాయి. అయితే 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కుప్పకూలింది. లెఫ్ట్ పార్టీలతో కలిసి పొత్తు పెట్టుకున్నప్పటికీ ఏమాత్రం రాణించలేకపోయింది

West Bengal: కాంగ్రెస్‭కు గుండు సున్నా.. పార్టీకి హ్యాండ్ ఇచ్చిన ఏకైక ఎమ్మెల్యే

Congress MLA: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే బేరన్ విశ్వాస్ సోమవారం హస్తం పార్టీకి హ్యాండిచ్చి అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీఎంసీ జాతీయ కార్యదర్శి అభిషేక్ బెనర్జీ సమక్షంలో ఆయన కండువా కప్పుకున్నారు. దీంతో బెంగాల్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం సున్నాకి పడిపోయింది.

Gehlot and Pilot: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ముందు అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య కుదిరిన ఒప్పందం

వాస్తవానికి 2021లో జరిగిన పశ్చిమ బెంగాల్‌ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఒక్క సీటూ గెలవలేదు. అయితే ఈ ఏడాది మొదట్లో జరిగిన ఉపఎన్నికల్లో మైనార్టీల ప్రాబల్యం ఉన్న సాగర్‌దిఘీ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ తరఫున బేరన్‌ బిశ్వాస్‌ విజయం సాధించి, బెంగాల్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరిచారు. అయితే తాజాగా ఆయన పార్టీ మారడంతో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోయింది.

Maharashtra Politics: అలా మహా వికాస్ అఘాడీ పార్టీలకు ఓటమి తప్పదు.. ఎన్సీపీ కీలక నేత అజిత్ పవార్ హాట్ కామెంట్స్

2016 నాటి బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 44 స్థానాలు సాధించి ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 12.25 శాతం ఓట్లు వచ్చాయి. అయితే 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కుప్పకూలింది. లెఫ్ట్ పార్టీలతో కలిసి పొత్తు పెట్టుకున్నప్పటికీ ఏమాత్రం రాణించలేకపోయింది. కాంగ్రెస్ పార్టీకి కేవలం 2.93 శాతం ఓట్లే వచ్చాయి. ఇక సీట్లు ఒక్కటంటే ఒక్కటి కూడా గెలవలేదు. లెఫ్ట్ పార్టీలదీ ఇదే పరిస్థితి.