AICC President election: పార్టీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడనున్న వారిపై అనవసర వ్యాఖ్యలు వద్దు: తమ నేతలకు కాంగ్రెస్ సూచన

కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక రేసులో నిలవాలనుకుంటున్న నేతలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయొద్దని కాంగ్రెస్ ప్రతినిధులు, పదాధికారులను కోరుతున్నాను. మనకు మన వ్యక్తిగత ప్రాధాన్యతలు ఉండొచ్చు.. కానీ, పార్టీ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలి’’ అని ఆయన చెప్పారు. కాగా, పార్టీ అధ్యక్ష పదవి కోసం ఎన్నిక నిర్వహించడానికి కాంగ్రెస్ పార్టీలో మాత్రమే ప్రజాస్వామ్యబద్ధమైన, పారదర్శకమైన వ్యవస్థ ఉందని ఆ పార్టీ తెలిపింది. సంస్థాగత ఎన్నికలు నిర్వహించడానికి కూడా స్వతంత్ర ఎన్నికల అథారిటీ ఉందని చెప్పింది. 

AICC President election: పార్టీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడనున్న వారిపై అనవసర వ్యాఖ్యలు వద్దు: తమ నేతలకు కాంగ్రెస్ సూచన

AICC President election

AICC President election: ఏఐసీసీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడాలని భావిస్తున్న నేతలపై అనవసర వ్యాఖ్యలు చేయొద్దంటూ తమ పార్టీ నేతలను కాంగ్రెస్ హెచ్చరించింది. ఆ పదవి రేసులో నిలుస్తున్న శశి థరూర్ పై కాంగ్రెస్ నేత గౌరవ్ వల్లభ నిన్న తీవ్ర విమర్శలు చేయడంతో కాంగ్రెస్ ఈ హెచ్చరిక చేసినట్లు తెలుస్తోంది. నిన్న గౌరవ్ వల్లభ మాట్లాడుతూ… ‘‘సోనియా గాంధీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సమయంలో శశి థరూర్ కాంగ్రెస్ నాయకత్వం, పార్టీలో మార్పుల గురించి లేఖలు రాశారు. ఆయన పార్టీకి అందించిన సహకారం ఇలా లేఖలు రాయడం మాత్రమే’’ అని విమర్శించారు.

దీంతో ఇవాళ కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక రేసులో నిలవాలనుకుంటున్న నేతలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయొద్దని కాంగ్రెస్ ప్రతినిధులు, పదాధికారులను కోరుతున్నాను. మనకు మన వ్యక్తిగత ప్రాధాన్యతలు ఉండొచ్చు.. కానీ, పార్టీ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలి’’ అని ఆయన చెప్పారు. కాగా, పార్టీ అధ్యక్ష పదవి కోసం ఎన్నిక నిర్వహించడానికి కాంగ్రెస్ పార్టీలో మాత్రమే ప్రజాస్వామ్యబద్ధమైన, పారదర్శకమైన వ్యవస్థ ఉందని ఆ పార్టీ తెలిపింది. సంస్థాగత ఎన్నికలు నిర్వహించడానికి కూడా స్వతంత్ర ఎన్నికల అథారిటీ ఉందని చెప్పింది.

Amit shah slams nitish kumar: ఇలాగైతే నితీశ్ బాబు దేశ ప్రధాని ఎలా కాగలరు?: అమిత్ షా