GSLV-F11 సక్సెస్ : సముద్రాన్ని జల్లెడ పెట్టేస్తోంది

  • Published By: Mahesh ,Published On : December 19, 2018 / 02:09 PM IST
GSLV-F11 సక్సెస్ : సముద్రాన్ని జల్లెడ పెట్టేస్తోంది

ఇస్రో మరో విజయం సాధించింది. జీఎస్ఎల్ వీ-ఎఫ్ 11 రాకెట్ ప్రయోగం విజయవంతం అయింది. రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరి కోటలోని అంతరిక్ష పరిశోధన కేంద్రం నుంచి జీఎస్ఎల్ వీ-ఎఫ్ 11 రాకెట్ను ప్రయోగించారు. రాకెట్ను శాస్త్రవేత్తలు కక్ష్యలో ప్రవేశపెట్టారు. 2,250 కిలోల బరువు ఉన్న జీశాట్-7ఏ ఉపగ్రహాన్ని జీఎస్ ఎల్ వీ-ఎఫ్ 11 రాకెట్ నింగిలోకి తీసుకెళ్లింది. వైమానిక, రక్షణ శాఖలకు జీశాట్-7ఏ ఉపయోగపడనుంది. 8 ఏళ్లు సేవలు అందించనుంది. కమ్యూనికేషన్ల వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. నెల వ్యవధిలో 3వ ప్రయోగం విజయవంతం అయ్యింది.
ప్రయోగంలో కొత్త టెక్నాలజీ ఉపయోగించాం : ఇస్రో ఛైర్మన్
శాటిలైట్ ప్రయోగంలో కొత్త టెక్నాలజీని ఉపయోగించామని ఇస్రో ఛైర్మన్ శివన్ తెలిపారు. శాటిలైట్ రివ్యూ టెక్నాలజీని వినియోగించామని చెప్పారు.