కరోనా పంజా : చార్మినార్, గోల్కొండ క్లోజ్

  • Published By: madhu ,Published On : March 18, 2020 / 02:17 AM IST
కరోనా పంజా : చార్మినార్, గోల్కొండ క్లోజ్

కరోనా పంజా విసురుతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఈ వైరస్ వ్యాపించకుండా..పలు చర్యలు తీసుకొంటోంది. అందులో భాగంగా..మార్చి 31 వరకు స్కూళ్లు, కాలేజీలు, పబ్బులు, బార్లు, ఇతరత్రా మూసివేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. తాజాగా కేంద్ర పురావస్తు సర్వేక్షణ విభాగం (ASI) ప్రధాన పర్యాటక కేంద్రాలను మూసివేసింది. 2020, మార్చి 17వ తేదీ మంగళవారం నుంచి గోల్కొండ, చార్మినార్, వరంగల్ కోట తదితర ప్రాంతాలకు పర్యాటకులు వెళ్లవద్దని సూచించింది. మరోవైపు..వేయిస్థంబాల దేవాలయం, రామప్ప గుడి, గద్వాల జోగుళాంబ దేవాలయాలకు తక్కువ సంఖ్యలో ప్రజలు వస్తున్నారు. 

Also Read | లైంగిక వేధింపుల కేసులో బాక్సింగ్ కోచ్ అరెస్ట్

ఇదిలా ఉంటే…రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాలపై కూడా దృష్టి సారించింది. ఆలయాల్లో పరిశుభ్రత చర్యలు ముమ్మరం చేశారు. కరోనా వైరస్ వ్యాపించే విధానం, దానిని నియంత్రించేందుకు అనుసరించాల్సిన పద్ధతులపై ప్రచారం ముమ్మరం చేశారు. అందులో భాగంగా..ఏప్రిల్ 02వ తేదీన వచ్చే శ్రీరామ నవవి ఉత్సవాలపై అధికారులు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ కళ్యాణాన్ని పూర్తిగా..ఆలయ కార్యక్రమంగా పరిమితం చేశారు. అర్చకులు, ప్రభుత్వ ప్రతినిధులు, ఉద్యోగులు మాత్రమే పాల్గొనేలా చర్యలు చేపట్టారు. సాధారణ భక్తులు రాకుండా..కట్టడి చేస్తున్నారు.

ఇందులో భాగంగా ఆన్ లైన్ టికెట్లను రద్దు చేశారు. బలవంతంగా భక్తులు రాకుండా కట్టడి సాధ్యం కానందున..స్వచ్చందంగా ఆలయ సందర్శన విరమించుకుని ఇళ్లలో వేడుకలు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఉగాది వేడుకలనూ, ఆర్భాటాలకు దూరంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ప్రగతి భవన్‌లో నిర్వహించే వేడుకలకు సాధారణ ప్రజలు రాకుండా చూడాలని అనుకుంటున్నట్లు సమాచారం. 

Read More :  నిర్భయ కేసు చావు తెలివితేటలు : ఆ రోజు ఢిల్లీలో లేను – ముకేశ్ సింగ్