Publish Date - 12:57 am, Thu, 30 January 20
By
madhuకరోనా వైరస్ భారత్‌ను వణికిస్తోంది. చైనా, ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను అంతర్జాతీయ విమానాశ్రయాల్లో అధికారులు పరీక్షిస్తున్నారు. ఢిల్లీలో మూడు అనుమానిత కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో మొత్తం 10 అనుమానిత కేసులు నమోదయ్యాయి. భారత్‌లో పాజిటివ్ కేసులు లేకపోయినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ముందస్తు చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే కేంద్రం నుంచి నిపుణుల బృందం రాష్ట్రంలో పర్యటిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం రెండు నోడల్ సెంటర్లను ఏర్పాటు చేసింది.
కరోనా వైరస్ పట్ల ప్రజలు భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదన్నారు ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్. ఇక్కడున్న వాతావరణ పరిస్థితులకు వైరస్ ఎటాక్ అయ్యే అవకాశమే లేదన్నారు. ప్రజలు వదంతులు నమ్మొద్దన్నారు. దేశంలో ఇప్పటివరకు ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదన్నారు మంత్రి ఈటెల రాజేందర్.
కరోనా లక్షణాలున్నవారికి వైద్యం అందించేందుకు ఫీవర్, గాంధీ, చెస్ట్ ఆసుపత్రుల్లో కలిపి మొత్తం 100 బెడ్స్ తో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేసింది ఆరోగ్యశాఖ. ఈ వార్డుల్లో అవసరమైతే వెంటిలేటర్స్ ని కూడా ఏర్పాటు చేస్తామన్నారు ఈటెల రాజేందర్.
కొత్త వ్యాధులు వస్తే ఎదుర్కోవడానికి తెలంగాణ ప్రభుత్వం చెస్ట్ ఆస్పత్రిలో క్లీన్ హాస్పిటల్‌ను నిర్మించనుంది. అటు కరోనా వైరస్ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు
Read More : బాబు సైంధవుడు : ఏపీ మంత్రుల ఫైర్
Private Teachers: టీచర్లకు ఆర్ధిక సాయం.. మీ పేరు ఉందో లేదు తెలుసుకోండి
Jagan Meeting: టెన్త్ పరీక్షలు రద్దు చేస్తారా? వాయిదా వేస్తారా?
COVID second wave: కరోనా కేసుల పెరుగుదలకు రెండు కారణాలు ఇవే!
No Mask: Railways Fine రైల్వే శాఖ కీలక నిర్ణయం..మాస్క్ లేకుంటే రూ.500 జరిమానా
Gandhi Hospital : పూర్తిస్థాయి కోవిడ్ ఆస్పత్రిగా గాంధీ..
Sonu Sood : సోనూ సూద్‌కు కరోనా.. ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత సోకిన మహమ్మారి..