PM Modi: అవినీతిలో కూరుకుపోయినవారందరూ ఒకే వేదికపైకి వస్తున్నారు: విపక్షాలపై మోదీ విసుర్లు

వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో విపక్ష పార్టీలు కూటమి ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అవినీతిలో కూరుకుపోయినవారందరూ ఒకే వేదికపైకి వస్తున్నారని మోదీ ఎద్దేవా చేశారు.

PM Modi: అవినీతిలో కూరుకుపోయినవారందరూ ఒకే వేదికపైకి వస్తున్నారు: విపక్షాలపై మోదీ విసుర్లు

PM Modi: విపక్ష పార్టీలపై ప్రధాని మోదీ (PM Modi) మండిపడ్డారు. అవినీతిలో కూరుకుపోయినవారందరూ ఒకే వేదికపైకి వస్తున్నారని విమర్శించారు. ఇవాళ ఢిల్లీలో నిర్వహించిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మోదీ మాట్లాడారు. అవినీతి మూలాలను తాము ఏరి పారేశామని చెప్పారు. నగదు అక్రమ చలామణీ నిరోధక చట్టం (PMLA ) ద్వారా కాంగ్రెస్ పార్టీ పాలనలో కేవలం రూ.5,000 కోట్లు జప్తు చేస్తే, తమ బీజేపీ సర్కారు రూ.10,00,000 కోట్లు జప్తు చేసిందని చెప్పారు.

పారిపోయిన 20 వేల మంది ఆర్థిక నేరస్థులను తాము పట్టుకున్నామని ప్రధాని మోదీ తెలిపారు. ఇటీవల జరిగిన ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో విపక్షాలు తట్టుకోలేకపోతున్నాయని చెప్పారు. గుజరాత్ లో బీజేపీ విజయం సాధించిన సమయంలో విపక్షాలు ఇలాగే ప్రవర్తించాయని తెలిపారు. కేంద్రంలో తాము 2 లోక్ సభ సీట్లతో ప్రయాణాన్ని ప్రారంభించి 303 సీట్లకు చేరుకున్నామని ప్రధాని మోదీ చెప్పారు.

దేశంలో తూర్పు నుంచి పశ్చిమం వరకు, ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు బీజేపీ మాత్రమే పాన్-ఇండియా పార్టీ అని ప్రధాని మోదీ అన్నారు. కాగా, వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో విపక్ష పార్టీలు కూటమి ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు పార్టీల నేతలు చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే అవినీతిలో కూరుకుపోయినవారందరూ ఒకే వేదికపైకి వస్తున్నారని మోదీ ఎద్దేవా చేశారు.

Om Birla: లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం.. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రతిపక్షాల ప్రయత్నాలు?