Maharashtra: మహా అసెంబ్లీలో అరుదైన దృశ్యం.. ఉల్లాసంగా పలకరించుకున్న ఉద్ధవ్, ఫడ్నవీస్

ఎన్నికల అనంతరం బీజేపీకి గుడ్ బై చెప్పిన నాటి నుంచి మహారాష్ట్ర రాజకీయాల్లో (Maharashtra Politics) ఫడ్నవీస్, థాకరే బద్ద శత్రువులుగా మారిపోయారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య రాజకీయ మాటల యుద్ధం జరగని రోజు లేదు. ఎప్పటికప్పుడు ఎత్తులు, పై ఎత్తులతో ఒకరి మీద మరొకరు ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు.

Maharashtra: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే(Uddhav Thackeray)కి ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‭(Devendra Fadnavis)కి మధ్య రగులుతున్న రాజకీయ వాతావరణం గురించి ప్రత్యేకంగా చెప్పేది కాదు. ఈ ఇద్దరు నేతల మధ్య పచ్చ గడ్డి అలా వేయడం ఆలస్యం, అర సెకనులో కాలి బూడిదవుతుంది. అలాంటి ఉన్నట్టుండి ఈ నేతలు కాస్త ఆప్యాయంగా పలకరించుకుని, కాసేపు ఉల్లసంగా సంభాషించుకున్నారు. రాష్ట్ర అసెంబ్లీలో గురువారం కనిపించిన దృశ్యం ఇది. వాస్తవానికి మహారాష్ట్ర రాజకీయాల్లో ఇలాంటి సంస్కృతి సహజంగానే ఉంటుంది. రాజకీయంగా ఎంత వైరంతో ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా బాగానే మసులుతుంటారు. అయితే ఇది రాజకీయ ప్రాంగణాల్లో అరుదుగా కనిపిస్తుంటుంది.

Rahul Gandhi: అదే జరిగితే ఇక రాహుల్ రాజకీయం జీవితం చిక్కుల్లో పడ్డట్టే

అలాంటిది అసెంబ్లీ భవనంలో ఇద్దరు శత్రువులు ఉల్లాసంగా కలుసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరాఠీ భాషా విభాగం సమావేశంలో పాల్గొనేందుకు శాసనమండలి సభ్యుడు (ఎమ్మెల్సీ) అయిన ఉద్ధవ్ ఠాక్రే గురువారం విధన సభకు వచ్చారు. ఈ సందర్భంలోనే ఈ అరుదైన దృశ్యం కనిపించింది. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి పదవీ పంచుకోవడంపై బేధాభిప్రాయాలు ఏర్పడి బీజేపీతో అవిభక్త శివసేన తెగతెంపులు చేసుకుంది. అనంతరం ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇందుకు ప్రతిగా శివసేనను బీజేపీ రెండుగా చీల్చి, థాకరేను ముఖ్యమంత్రి పదవి నుంచి దింపేసింది (ప్రతీకారం తీర్చుకున్నామని ఫడ్నవీస్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు).

Bombay HC: కట్నం తీసుకున్న తర్వాత ఆస్తిపై కుమార్తెకు హక్కు ఉంటుందా? బాంబే హైకోర్టు తాజా తీర్పు ఏంటంటే?

ఎన్నికల అనంతరం బీజేపీకి గుడ్ బై చెప్పిన నాటి నుంచి మహారాష్ట్ర రాజకీయాల్లో (Maharashtra Politics) ఫడ్నవీస్, థాకరే బద్ద శత్రువులుగా మారిపోయారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య రాజకీయ మాటల యుద్ధం జరగని రోజు లేదు. ఎప్పటికప్పుడు ఎత్తులు, పై ఎత్తులతో ఒకరి మీద మరొకరు ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు.

ట్రెండింగ్ వార్తలు