RSS: స్వాతంత్ర్య పోరాటంలో ఆర్ఎస్ఎస్ పాత్ర ఎంత? సిద్ధరామయ్య అభిప్రాయం ఏంటంటే?

బీజేపీ ప్రభుత్వం పేదలు, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఏనాడూ కృషి చేయలేదు. బీజేపీ పాలనలో కొన్ని విజయాలు కూడా చెప్పగలరా? వారు రిజర్వేషన్లను వ్యతిరేకించారు, వారు ఎల్లప్పుడూ మైనారిటీలకు వ్యతిరేకంగా ఉన్నారు. మండల్‌ కమిషన్‌ విధానాన్ని వ్యతిరేకించారు. సామాజిక న్యాయానికి బీజేపీ ఎప్పుడూ అనుకూలంగా లేదు. ఇంతకు ముందెప్పుడూ లేదు, భవిష్యత్తులోనూ ఉండదు

RSS: స్వాతంత్ర్య పోరాటంలో ఆర్ఎస్ఎస్ పాత్ర ఎంత? సిద్ధరామయ్య అభిప్రాయం ఏంటంటే?

RSS: బ్రిటిషర్లకు వ్యతిరేకంగా జరిగిన భారత స్వాతంత్ర్య పోరాటంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పాత్రపై తరుచూ చర్చ జరుగుతూనే ఉంటుంది. భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవడానికి ఈ మధ్య కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని తరుచుగా ప్రస్తావిస్తోంది. తాజాగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇదే అంశాన్ని లేవనెత్తి విమర్శలు గుప్పించారు. నవంబర్ 26న భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశం కోసం ఆర్ఎస్ఎస్ చేసింది ఏమీ లేదని, స్వాతంత్ర్య పోరాటంలో ఆర్ఎస్ఎస్‭కు చెందిన వారు ఒక్కరంటే ఒక్కరు కూడా లేరని ఆయన విమర్శలు గుప్పించారు.

Naked Art: క్యాన్సర్‭పై అవగాహన కార్యక్రమం.. 2,500 మంది బట్టలు విప్పేసి ఫొటోలకు ఫోజు ఇచ్చారు

కర్ణాటక రాజధాని బెంగళూరులో నిర్వహించిన ‘రాజ్యాంగ దినోత్సవ ర్యాలీ’లో సిద్ధరామయ్య మాట్లాడుతూ ‘‘స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న ఒక్క ఆర్ఎస్ఎస్ కార్యకర్త పేరు మీరు చెప్పగలరా? బ్రిటిషర్లకు ఆర్ఎస్ఎస్ సహాయంగా పని చేసిందని చెప్పడానికి ఇంత కంటే ఉదహారణ అక్కర్లేదు. ఇలాంటి ఉదహారణలు అనేకం ఉన్నాయి. మనల్ని వెనక్కి నెట్టేయడానికి ఇద్దరు కలిసే పని చేశారు’’ అని అన్నారు.

DK Shivakumar: ఒక కుటుంబానికి ఒకే టికెట్.. కట్టుదిట్టంగా అమలు చేస్తామంటున్న కాంగ్రెస్

ఇక భారతీయ జనతా పార్టీపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సామాజిక న్యాయానికి బీజేపీ వ్యతిరేకమని, సమాజ అభివృద్ధిని అడ్డుకుంటుందే బీజేపీయని ఆయన అన్నారు. ‘‘బీజేపీ ప్రభుత్వం పేదలు, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఏనాడూ కృషి చేయలేదు. బీజేపీ పాలనలో కొన్ని విజయాలు కూడా చెప్పగలరా? వారు రిజర్వేషన్లను వ్యతిరేకించారు, వారు ఎల్లప్పుడూ మైనారిటీలకు వ్యతిరేకంగా ఉన్నారు. మండల్‌ కమిషన్‌ విధానాన్ని వ్యతిరేకించారు. సామాజిక న్యాయానికి బీజేపీ ఎప్పుడూ అనుకూలంగా లేదు. ఇంతకు ముందెప్పుడూ లేదు, భవిష్యత్తులోనూ ఉండదు’’ అని అన్నారు.

Ravindra Jadeja: గాయం పేరుతో బంగ్లా టూర్ డుమ్మా కొట్టి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జడేజా.. తీవ్ర స్థాయిలో విమర్శలు