Karnataka Politics: అంతా పట్టుపట్టి మొదటికి వచ్చిన డీకే శివకుమార్.. అయితే ఒక్క షరతు

కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ కూటమి సర్కార్ 2019లో కూలిపోవడానికి కారణమైన ఎమ్మెల్యేల ఫిరాయింపులను సిద్ధరామయ్య ఆపలేకపోయారనేది డీకే వాదన. సిద్ధరామయ్య కాకుండా తన రాజకీయ గురువైన ఖర్గేకు సీఎం పదవి ఇస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని అధిష్ఠానం ముందు ఆయన కుండబద్ధలు కొట్టారు.

Karnataka Politics: అంతా పట్టుపట్టి మొదటికి వచ్చిన డీకే శివకుమార్.. అయితే ఒక్క షరతు

Siddaramaiah vs DK: కర్ణాటక ముఖ్యమంత్రి దాదాపుగా ఒక కొలిక్కి వచ్చినట్టే కనిపిస్తోంది. తనకు కచ్చితంగా ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రి పదవి కావాలని పట్టుపట్టిన కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఎట్టకేలకు దిగి వచ్చారు. అయితే మొదటి ప్రతిపాదన అయిన ముఖ్యమంత్రి కుర్చీ షేరింగ్‭కే ఆయన ఒప్పుకోవడం గమనార్హం. సీఎం పదవి తనకే ఇవ్వాలని, పదవిని పంచుకోవడం కుదరదని, డిప్యూటీ సీఎం తీసుకోవడం కంటే ఎమ్మెల్యేగా ఉండిపోవడం బెటరని అధిష్టానానికి తెగేసి చెప్పిన డీకే చెరో రెండున్నరేళ్లు సిద్ధరామయ్యతో ముఖ్యమంత్రి పదవిని పంచుకునేందుకు డీకే అంగీకరించారు.

Supreme Court : ప్రేమ వివాహం చేసుకున్నవారే ఎక్కువగా విడాకులు తీసుకుంటున్నారు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

అయితే పదవి పంచుకోవడానికి ఒప్పుకున్నారు కానీ, ఇందుకు ఒక షరతును విధించినట్టు తెలుస్తోంది. తొలి రెండున్నరేళ్లు సీఎం పదవి తనకే ఇవ్వాలని ఆయన కోరినట్టు చెబుతున్నారు. అయితే ముందుగా చేసిన ప్రతిపాదనలో మొదటి రెండేళ్లు సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉంటారు. ఆ తర్వాత మూడేళ్లు డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ఉంటారు. కానీ తాజా ప్రతిపాదనలో రెండున్నరకు కుదించి, మొదట తానే ఉంటానని డీకే చెప్పారు. గురువారం కర్ణాటక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయాలి. ఈ నేపథ్యంలో ఈరోజే ఈ అంశాన్ని కొలిక్కి తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ సర్వ శక్తులు ఒడ్డుతోంది.

Bihar Politics: దీరేంద్ర శాస్త్రి బాబా ‘హిందూ రాష్ట్ర’ వ్యాఖ్యలపై నితీశ్ కుమార్ విమర్శలు

కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ కూటమి సర్కార్ 2019లో కూలిపోవడానికి కారణమైన ఎమ్మెల్యేల ఫిరాయింపులను సిద్ధరామయ్య ఆపలేకపోయారనేది డీకే వాదన. సిద్ధరామయ్య కాకుండా తన రాజకీయ గురువైన ఖర్గేకు సీఎం పదవి ఇస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని అధిష్ఠానం ముందు ఆయన కుండబద్ధలు కొట్టారు. అయితే, తనపై కేసులు ఉన్నందునే అధిష్ఠానం బెదురుతోందని గ్రహించిన డీకే… సిద్ధరామయ్యను నేరుగా కాదనకుండా సీఎం సీటు షేరింగ్ విషయంలో మెలికి పెట్టడమే మంచిదన్న అభిప్రాయానికి వచ్చారని చెబుతున్నారు.